జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కమెడియన్ శాంతి స్వరూప్( Shanthi Swaroop) ఎక్కువగా లేడీ గెటప్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇక ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.
ఇలా వారి జీవితంలో జరిగిన సంతోషాల గురించి బాధల గురించి అనారోగ్య సమస్యల గురించి కూడా అన్ని విషయాలను ఈ వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే కొన్నిసార్లు కొంతమంది సెలబ్రిటీలో భారీ స్థాయిలో నెటిజన్ల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
ఇక శాంతి స్వరూప్ గత కొద్ది రోజుల క్రితం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు.తన అమ్మకు అనారోగ్యం చేసిందని తనకు ట్రీట్మెంట్ చేయించడం కోసం సరిపడే అంత డబ్బు తన వద్ద లేదని దీంతో ఆయన తన ఇంటిని కూడా అమ్మేయాలనుకుంటున్నాను అంటూ ఒక వీడియోని షేర్ చేశారు.ఇలా ఈ వీడియో పై చాలా మంది సానుభూతి చూపించారు.ఎలాగైనా తన తల్లి ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్నారు.అయితే ఈ వీడియో షేర్ చేసి కొద్ది రోజులు కూడా తిరగకముందే ఈయన కొత్త కారును( New Car ) కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేశారు. దీంతో నేటిజన్స్ భారీ స్థాయిలో ఈయనపై ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా శాంతి స్వరూప్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.కొత్త కారులో ఎంతో సంతోషంగా కూర్చుని సరదాగా ఉన్న ఒక వీడియోని షేర్ చేస్తూ మై డ్రీమ్ అంటూ కింద క్యాప్షన్ ఇచ్చారు.దీంతో ఈయన కొత్త కారు కొనుగోలు చేశారని భావించినటువంటి నెటిజన్స్ భారీగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.మొన్ననే కదా అమ్మకు బాగాలేదు చికిత్స కోసం ఇంటిని కూడా అమ్ముతున్నావు అంటూ ఒక వీడియో చేశారు.
అప్పుడే కొత్త కారు కొనడానికి డబ్బు ఎలా వచ్చాయి అంటూ పెద్ద ఎత్తున శాంతి స్వరూప్ పై నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ వ్యాఖ్యలపై శాంతి స్వరూప్ ఎలా స్పందిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.