ప్రతి ఆదివారం బుల్లితెరపై ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఎంతో మంచి క్రేజ్ ఏర్పడింది.ఈ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డేస్ అంటూ కమెడియన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకువచ్చి పెద్దఎత్తున సందడి చేస్తున్నారు.
తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా పలువురు కమెడియన్స్ వారి తండ్రులను శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి తీసుకువచ్చి సందడి చేశారు.వీరిలో కమెడియన్ బాబీ తండ్రి మాత్రం రష్మీతో చేసిన రచ్చ మాములుగా లేదు.
</br.
ఎందుకు వచ్చావని ఈయనని ప్రశ్నించగా రష్మీని చూడటం కోసం వచ్చానని షాకింగ్ సమాధానం చెప్పారు.
ఇక తన ఫోన్ నెంబర్ ను రెండు చీటీలలో రాసుకువచ్చి రష్మీ తన ఫోన్ నెంబర్ ఇస్తుందేమోనని ఆశ పడినట్లు తెలిపారు.రెండు చీటీలలో నీ ఫోన్ నెంబర్ ఎందుకు రాసుకొచ్చారని ప్రశ్నించగా ఒకటి రష్మి కోసం మరొకటి పూర్ణ కోసం అంటూ సమాధానం చెప్పారు.
ఈ విధంగా బాబి తండ్రి రష్మీతో పులిహోర కలపడంతో తనని వేదికపై నుంచి తీసుకెళ్తామని ప్రయత్నం చేసిన అతను మాత్రం వెళ్లలేదు.

ఇక రష్మీ ముందుకు వెళ్లి మోకాళ్ళపై కూర్చుని నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను బాధ పడతా అంటూ సుధీర్ డైలాగులు చెబుతూ తనకి ప్రపోజ్ చేశారు.ఒక్కసారిగా బాబి తండ్రి రష్మీకి ప్రపోజ్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు.ఇక ఈ కార్యక్రమం చూసిన ఎంతో మంది నెటిజన్లు ముసలోడే కానీ మామూలుగా లేడు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.