బ్రతికుండగానే చంపేస్తున్నారంటూ ఎమోషనల్ అయిన అప్పారావు.. ఏం జరిగిందంటే?

ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు( Youtube Channels ) వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతున్నాయి.

బ్రతికున్న సెలబ్రిటీలు చనిపోయారంటూ వార్తలను ప్రచారం చేస్తూ ఫేక్ న్యూస్ తో వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి.

అయితే జబర్దస్త్ కామెడీ షోతో( Jabardasth ) పాటు సినిమాల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న అప్పారావు( Apparao ) ఈ తరహా వార్తల గురించి స్పందిస్తూ తీవ్రస్థాయిలో యూట్యూబ్ ఛానెళ్లపై ఫైర్ అయ్యారు.అప్పారావు ఇప్పుడు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు అయినా చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలొ ఉన్నారు.

తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో ఆప్పారావు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.యూట్యూబ్, సోషల్ మీడియా థంబ్ నైల్స్ వల్ల చాలామంది నటీనటులు మానసిక క్షోభను ఎదుర్కొంటున్నారని అప్పారావు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

యూట్యూబ్ నీకో దండం.నేను ఈ విషయాలను చాలా బాధతో చెబుతున్నానని అప్పారావు పేర్కొన్నారు.గొప్ప నటులు బ్రతికుండగానే చంపేస్తున్నారని ఏది పడితే అది రాసేస్తున్నారని నిజాలు రాయాలని ఉన్నది ఉన్నట్టు రాయాలని చనిపోకముందే చనిపోయినట్టు రాయవద్దని ఇది నేను బాధతో చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు.

Advertisement

బ్రతికున్న మనిషి గురించి చనిపోయారని ప్రచారం చేసే హకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.

ఎవరైనా ఏదో ఒక సమయంలో చనిపోవాలని ఇలాంటి వార్తలు రాసేవాళ్లు కూడా చనిపోవాల్సిందేనని అప్పారావు పేర్కొన్నారు.దారుణమైన క్యాప్షన్లు పెట్టి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేయొద్దని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు.అప్పారావు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అప్పారావు చేసిన కామెంట్లలో నిజం ఉందని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలాంటి యూట్యూబ్ ఛానెళ్ల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అప్పారావు జబర్దస్త్ షోతో మళ్లీ బిజీ కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు