సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా భారీ డిజాస్టర్ అయితే ఆ దర్శకునికి మరో ఆఫర్ రావడం సులువు కాదు.ఎంతో టాలెంట్ ఉన్నా ప్రూవ్ చేసుకోలేక ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు.
ఒక్క ఛాన్స్ అంటూ కళ్లు కాయలు కాచేలా ఎంతోమంది డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు.అయితే షాడో( Shadow ) తర్వాత పదేళ్లు గ్యాప్ ఇచ్చినా మెహర్ రమేష్ మాత్రం తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోలేకపోయారు.
భోళా శంకర్ సినిమా( Bhola Shankar )ను ఎంత చెత్తగా తెరకెక్కించాలో మెహర్ రమేష్ అంత చెత్తగా తెరకెక్కించారు.సినిమాలో ఒక్క సన్నివేశం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా అయితే లేదు.మెహర్ రమేష్ అటు హీరోలను, ఇటు నిర్మాతలను ముంచేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.వందల కోట్ల రూపాయలను మెహర్ రమేష్ బూడిదలో పోసిన పన్నీరు చేసేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మెహర్ రమేష్( Meher Ramesh ) ఇలాంటి సినిమాలు తీయడం కంటే సినిమాలకు దూరంగా ఉండటం బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మెహర్ రమేష్ చెత్త కామెడీ సీన్లతో ఈ సినిమాను నడిపించారు.
ల్యాగ్ సీన్లతో మెహర్ రమేష్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించారు.టాలీవుడ్ ఇండస్ట్రీలోని భారీ డిజాస్టర్ల జాబితాలో భోళా శంకర్ మూవీ కూడా చేరే అవకాశాలు అయితే ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఈ సినిమాకు ఎలా అంగీకరించారో అర్థం కావడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి రొటీన్ మాస్ మసాలా మూస కథలకు దూరంగా ఉంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.చిరంజీవి ఈ సినిమా కోసం 65 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది.మెహర్ రమేష్ మరో రంగంలో కెరీర్ ను మొదలుపెడితే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిరంజీవి, కీర్తి సురేష్ మినహా ఈ సినిమాలో ఎవరూ పాత్రలకు న్యాయం చేయలేదు.