మహమ్మద్ షమీ( Mohammed Shami ).ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పేరు గురించి పెద్ద చర్చ జరుగుతుంది.
వరల్డ్ కప్ సెమీఫైనల్( World Cup Semifinal ) మ్యాచ్లో 7 వికెట్లు పడగొట్టి ఆ మ్యాచ్ ఇండియా గెలవడానికి కారణమైన షమీ పై యావత్ ప్రపంచం ప్రశంసలు వర్షం కురిపిస్తుంది.ఇండియా గెలవడం నిజంగా అందరికీ సంతోషమే అలాగే షమీ ఒక క్రికెటర్ గా వికెట్స్ తీయడం కూడా ప్రతి ఒక్కరికి కావాల్సిందే.
ఎందుకంటే ఆట ఆడితేనే టీంలో స్థానం దక్కుతుంది.ఒక్కసారి వెనక్కి వెళితే మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు.
క్రికెట్ చాలా పీక్ ఆటగా ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తుంది.అందువల్ల క్రికెట్ లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు.
ఫామ్ లో ఉండడం ప్రతి ఒక క్రికెటర్ కి ఖచ్చితంగా అవసరం అందుకు షమీ అతీతుడు ఏమీ కాదు.

ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది షమీ వంటి ఆటగాడు ఇండియాకి దొరకడం నిజంగా అదృష్టమే అలాగే క్రికెట్ షమీకి కూడా మంచి అదృష్టకరమైన విషయమే.అయితే ప్రొఫెషనల్ జీవితం వేరు పర్సనల్ జీవితం వేరు అని ఖచ్చితంగా షమీ విషయంలో అందరూ గుర్తుంచుకోవాలి.మహమ్మద్ షమీకి హసిన్ జహన్( Hasin Jahan ) అనే మహిళతో పెళ్లికాగా వీటికి ఒక కుమార్తె కూడా ఉంది.
షమీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు కానీ తన భార్య విషయంలో మాత్రం చాలా దారుణంగా వ్యవహరించాడు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.హాస్యం తన భర్త తనను కొడుతున్నాడని పైగా తన తో వివాహం జరిగిన తర్వాత పరాయి స్త్రీలతో శృంగార సాగిస్తున్నాడని అతడికి సంబంధించిన అనేక చాట్స్ బయట పెట్టింది.

పైగా కార్ సీట్ కింది భాగంలో తనకు తెలియకుండా ఒక ఫోన్ మెయిన్టైన్ చేస్తున్నాడని అందులో చాలా మంది మహిళలతో తను నెరిపిన వ్యవహారాల గురించి చాలా క్లియర్ గా ఆమె అందరికీ బహిర్గతం చేసి అతని నుంచి 2018 లో విడాకులు తీసుకుని విడిగా ఉంటుంది.అప్పటినుంచి ఇద్దరు కూడా విడివిడిగానే బ్రతుకుతున్నారు అలాగే ప్రతినెలా భరణం కింద ఆమెకి కొంత సొమ్మును కూడా షమీ ఇస్తున్నాడు.ఇప్పుడు క్రికెట్లో శమీ అద్భుతాలు చేశాడు కాబట్టి అతని భార్య డబ్బుల కోసమే అతన్ని పెళ్లి చేసుకుంది లేదా విడాకులు తీసుకుంది అంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.ఆట అద్భుతంగా వారి దగ్గర వ్యక్తిగత జీవితంలో బాగుండాలని మీరు లేదు.
అలాగే వ్యక్తిగత జీవితంలో ఎంతో బాగా ఉన్న వ్యక్తులు ఆట సరిగా ఆడాలన్న విషయం కూడా ఏమీ లేదు.అందువల్ల షమీ చేసిన తప్పులు తన భార్య విషయంలో ఈరోజు ఒప్పులుగా మారిపోవు.
ఆమె ఒక కుమార్తెతో ఒంటరిగా తన జీవితాన్ని ఈరోజు గడపాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి.కోట్లు సంపాదిస్తున్న భర్తతో హ్యాపీగా ఉండొచ్చు కదా.కాస్త ఆమె గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేముందు మరొకసారి ఆలోచించి చేయాలనేదే ఈ ఆర్టికల్ యొక్క సారాంశం.