పాలసీసాల్లో పాలు పడుతున్నారా విషం పడుతున్నారా?

మీ పిల్లలకి పాలసీసాల్లో పాలు పడుతున్నారా ? అయితే ఒక్క క్షణం ఆగండి.ఆ పసి శరీరంలోకి ఎన్ని ప్రమాదాలు పంపిస్తున్నారో తెలుసుకోండి.

పాల సీసాలు ఉత్పత్తి చేసేందుకు ప్లాస్టిక్ లో Bisphenol S (BPS) ఆనే పదార్థం ఉంటోందని పరిశోధనలు తేల్చాయి.మరో బాధకరమైన విషయం ఏమిటంటే, ఇంతకుముందు Bisphenol A అనే మరో హానికరమైన పదార్థం వాడేవారు, దానిపై పరిశోధకులు మండిపడితే, దాన్ని వాడటం మానేసి, ఇప్పుడు మరో హానికరమైన పదార్థంతో తయారుచేస్తున్నారు.

ఇక్కడ కేవలం పదార్థమే మారింది.విషం కాదు.

ఈ BPS ఎండోక్రైన్ అనే హార్మోన్ పై నెగెటివ్ ప్రభావం చూపుతుంది.ఇక తాజాగా ఇది స్త్రీల ప్రధాన హార్మోన్ ఈస్ట్రోజన్ మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని అమెరికన్ పరిశోధకులు చెప్పారు.ఈ వాడకం వలన క్యాన్సర్ రావచ్చు ఇంకే ప్రమాదకరమైన జబ్బు అయినా రావచ్చు.

Advertisement

అందుకే తల్లి రొమ్ముతో పాలివ్వాలి.ఎంత బిజీ జీవితం అయినా, పిల్లల ఆరోగ్యం ముఖ్యం.

మేఘాలలో భయంకరమైన ఆకారాలు.. వీడియో చూస్తే వణుకు పుడుతుంది!
Advertisement

తాజా వార్తలు