సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో సరైన ఐటెం సాంగ్ పడి చాలా కాలం అవుతుంది.దీంతో ఆయన ఫ్యాన్స్ ఈ విషయంలో నిరాశ పడుతున్నారు.
మహేష్ ఆగడు సినిమాలో జంక్షన్ లో ఫంక్షన్ అనే సాంగ్ కు కుమ్మేసారు.ఆ తర్వాత ఈ రేంజ్ మరో ఐటెం సాంగ్ అయితే పడలేదు.
చాలా సినిమాలే వచ్చిన మధ్యలో ఇరికించి ఐటెం సాంగ్స్ చేసే కంటే చేయకపోవడమే బెటర్ అని మహేష్ భావించాడు.
దీంతో మహేష్ బాబు సినిమాల్లో ఐటెం సాంగ్ మిస్ అవుతూ వస్తుంది.
సరిలేరు నీకెవ్వరూ సినిమాలో తమన్నాతో స్పెషల్ సాంగ్ చేసాడు కానీ మిగతా సినిమాల్లో మాత్రం ఐటెం సాంగ్ అయితే పెట్టలేదు.ఇక మళ్ళీ ఇన్ని రోజులకు మహేష్ సినిమాలో కుమ్మేసే ఐటెం సాంగ్ ను తీసుకు రాబోతున్నారు అని తెలుస్తుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఐటెం సాంగ్స్ చూపించి చాలా రోజులే అవుతుంది.

ఈయన చివరిసారిగా అత్తారింటికి దారేది సినిమాలో ఐటెం సాంగ్ చూపించాడు.అందుకే ఈసారి ఇద్దరు కూడా స్పెషల్ గా చేయాలని అలోచించి ఐటెం నెంబర్ ను తీసుకు రావాలని అనుకుంటున్నారట.ఈ సాంగ్ కోసం ఒక హీరోయిన్ ను కూడా దింపే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి.
మరి ఈ సినిమాలో ఆడిపాడే లక్కీ ఛాన్స్ ఏ హీరోయిన్ అందుకుంటుందో చూడాలి.ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.
హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఎలాగైతేనేం అభిమానుల కోరిక తీరింది.త్రివిక్రమ్ ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.







