Italy Presicce Town: ప్రభుత్వం బంపరాఫర్.. ఆ గ్రామంలో నివాసముంటే ఇల్లు, రూ.25 లక్షల నజరానా

ప్రస్తుత రోజుల్లో ఇల్లు కట్టుకోవడం అంటే మాటలు కాదు.ప్రభుత్వాలు పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తున్నా, వాటి కోసం చాలా కష్టపడాలి.

 Italy Government Offering 25 Lakh Rupees Who Will Live In This Beautiful Town De-TeluguStop.com

చాలా దరఖాస్తులు పెట్టుకోవాలి.పరిశీలన తర్వాత మీరు పేదలు అని ప్రభుత్వం విశ్వసిస్తే మీకు పక్కా ఇళ్లను మంజూరు చేస్తుంది.

అందులోనూ ప్రతిపక్ష పార్టీకి చెందిన లేదా మద్దతిచ్చిన వారైతే ఆ ఇల్లు కూడా దక్కుతుందని గ్యారంటీ లేదు.అయితే ఇటలీ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు.

తన ప్రజలకు బంపరాఫర్ ప్రకటిస్తోంది.అందమైన, కట్టిన ఇళ్లను ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఏకంగా రూ.25 లక్షల డబ్బును ఉచితంగా అందచేస్తోంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఇటలీలోని పుగ్లియాలోని ఎండ ప్రాంతంలో ఉన్న సుందరమైన పట్టణం ప్రెసిక్స్.అక్కడ ప్రజలు చాలా తక్కువ మంది ఉంటారు.ఉన్న వారు వలసలు వెళ్లిపోతున్నారు.ఈ తరుణంలో అక్కడ నివసించే వారి సంఖ్య పెరగడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.ఈ తరుణంలో ఆ పట్టణంలో ఖాళీ ఇళ్లను కొనుగోలు చేయడానికి, అక్కడ నివాసం ఉండడానికి ప్రజలకు 30,000ల ఫ్రెంచ్ కరెన్సీని (దాదాపు రూ.25 లక్షలు) చెల్లిస్తామని ప్రకటించింది.

Telugu Beautiful Town, Bumber, Italy, Italypresicce, Latest, Rupees, Reward-Late

డీల్‌లో భాగంగా అమ్మకానికి ఉన్న ఇళ్ల ధర దాదాపు 25,000 యూరోలు.ఇటలీ అంతటా అమ్మకానికి ఉన్న ఇతర చౌకైన ఆస్తుల మాదిరిగానే, అవి వాటి అసలు యజమానులచే చాలాకాలంగా వదిలివేయబడ్డాయి.అదనపు బోనస్‌గా సాలెంటో ప్రాంతం యొక్క స్వభావంతో, శాంటా మారియా డి లూకా పౌడర్ బీచ్‌లు, చక్కని ప్రకృతి అక్కడ ఉంటుంది.ప్రతి సంవత్సరం నవజాత శిశువులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటున్నారు.

ప్రజలు ఎక్కువ మంది వలస వెళ్లిపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది.ఈ తరుణంలో స్థానిక జనాభా పెంచడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube