అంబ‌టికి ప‌రీక్ష‌గా మారిన గడప గడపకూ మన ప్రభుత్వం...!

ఏపీలో వైసీపీ వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టికే సిద్ద‌మైంది.ఈ నేప‌థ్యంలోనే ఆ పార్టీ అధినేత‌ సీఎం జ‌గ‌న్ గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ కార్యక్రమం చేపట్టి ఎమ్మెల్యేల‌కు ఆదేశాలిచ్చారు.

 It Is Our Government That Has Become A Test For Ambati , Cm Jagan, Ambati Rambab-TeluguStop.com

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన మంచిని వివరించడంతోపాటు సంక్షేమ పథకాల వల్ల ఎంత లబ్ధి చేకూరిందో వివరించాలని సూచించారు.ఆదేశాలు బేఖాత‌రు చేస్తే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.

తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగానే వైసీపీ తరఫున ఉన్నఎమ్మెల్యేలు గెలవని చోట ఆ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జులు ఈ కార్యక్రమం నిర్వహించాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు.

దీంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ తమ నియోజకవర్గ ప‌ర్య‌ట‌న‌ల్లో బిజీగా ఉన్నారు.అయితే చాలా చోట్ల వీరికి ప్ర‌జ‌ల నుంచి నిరసన సెగలు ఎదురవుతున్నాయి.

దీంతో ప్రశ్నించినవారిపై కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఫైర్ అవుతున్నారు.మీకు టీడీపీ అయితే పథకాలు రావని… ఏ కార్యక్రమాన్ని అమలు చేయబోమని డైరెక్ట్ గానే హెచ్చరిస్తున్నారు.

కొన్ని చోట్ల ఎదురు దాడికి దిగుతూ.మ‌రికొన్ని చోల్ల స‌మాధానం ఇవ్వ‌కుండానే వెళ్లిపోతున్నారు.

తాజాగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే తీరు ప్ర‌ద‌ర్శించారు.గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాజుపాలెంలో మంత్రి ఈనెల 1న పర్యటించారు.

ఈ క్రమంలో పింఛను కోసం దరఖాస్తు చేసుకుని మూడేళ్లైనా అంద‌లేద‌ని ఓ దివ్యాంగురాలు అంబటిని ప్రశ్నించింది.పక్కనే ఉన్న అధికారులు వాళ్ల ఇంటికి నాలుగు విద్యుత్ మీటర్లు ఉన్నాయని.

అందుకే పింఛను ఇవ్వలేదని చెప్పారు.దీంతో మంత్రి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆ మహిళ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

కనీసం సమాధానం కూడా చెప్పకుండా వెళ్లపోవడం ఏంటని మండిప‌డింది.

Telugu Ambati Rambabu, Cm Jagan, Ambati-Political

అలాగే బుల్లబ్బాయి అనే మరో వ్యక్తి ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి ప‌థ‌కాలు అంద‌డంలేద‌ని ఫైర్ అయ్యాడు.దీంతో అక్కడి నుంచి కూడా మంత్రి అంబటి మ‌రో వీధికి వెళ్లిపోయారు.మ‌రో పాత్రంలో ఓ వ్యక్తి రోడ్లు కావాలని అడ‌గ‌గా.

మంత్రి పక్కన ఉన్నవారు అతను టీడీపీ వ్యక్తి అని చెప్పగా.మంత్రి కూడా మీరు మీకు రోడ్లు ఎలా వేస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి.

అయితే ఇదంతా మీడియా క‌వ‌ర్ చేయ‌గా వారిని అంబటి పీఏ బెదిరించారనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా పోలీసులు ఎంట‌రై వీడియోలను డిలీట్ చేయించినట్లు తెలుస్తోంది.

సీఎం జ‌గ‌న్ ఎటువంటి భేదాలు లేకుండా అంద‌రికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్తుంటే.ఆ పార్టీ నేతల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

మ‌రి దీన్ని సీఎం ఎలా తీసుకుంటారో చూడాలి…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube