కరీంనగర్( Karimnagar ) లో ఏం అభివృద్ధి చేశారో బీజేపీ నేత బండి సంజయ్ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) అన్నారు.మతపరమైన అంశాలతో ఓట్లు అడగడం సరికాదని చెప్పారు.

రేపు చేవెళ్లలో రెండు పథకాలను కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు.గ్యాస్ సిలిండర్( Gas cylinder ) రూ.500 కే ఇస్తున్నామన్న మంత్రి పొన్నం కేంద్రం రిఫండ్ ఎప్పుడిస్తారో చెప్పాలని పేర్కొన్నారు.తాము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.







