గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పశువురు పాలు ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు లేదా నిస్సహాయంగా మారినప్పుడు వాటి యజమానులు వాటిని రోడ్లపై వదిలివేస్తుంటారు.దీంతో వాటిలోని చాలా పశువులు ఆకలితో అలమటించి చనిపోతుంటాయి.
అలాగే అవి వ్యాధుల బారిన పడతాయనే విషయం అందరికీ తెలిసిందే.అటువంటి పరిస్థితిలో రాజస్థాన్ ప్రభుత్వం జంతువుల భద్రత కోసం చాలా కఠినమైన నిబంధనలను అమలు చేసింది.
ఇకపై జంతువుల యజమానులు ఆవులను పెంచుకోవడానికి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేసిన ఈ కఠినమైన నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల పశువుల యజమానులు ఆవులను పెంచుకోవడానికి లైసెన్స్ పొందడం తప్పనిసరి చేశారు.
ఈ లైసెన్స్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటవుతుంది.ఈ నిబంధనతో రాష్ట్రంలోని దాదాపు 90 శాతం పశువురు ఎలాంటి రోగాల బారిన పడి ఆకలి, దాహంతో చనిపోకుండా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేసిన ఈ నిబంధనలకు నూతన గోపాలన్ రూల్స్ అని పేరు పెట్టారు.రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేసిన నూతన గోపాలన్ రూల్స్‌లో పశువుల యజమానులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పశువుల యజమానులు ఆవును పెంచేందుకు 100 గజాల స్థలం ఏర్పాటు చేయాలి.పట్టణ ప్రాంతాల్లో ఆవులు, గేదెలను పెంచాలంటే ఏడాదిపాటు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.