టీడీపీ, జనసేన పార్టీలవి దింపుడు కళ్లెం ఆశలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) అన్నారు.బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు( Chandrababu ) ఆరాటపడుతున్నారని చెప్పారు.
కుప్పం నియోజకవర్గంలోనూ వైసీపీ విజయం వైపు అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు.చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ కల్యాణ్( Pawan Kalyan ) దిగజారిపోయారని విమర్శించారు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ ను చూస్తే జాలేస్తోందని పేర్కొన్నారు.
జనసేనను( Janasena ) మింగేసి ప్రయోజనం పొందాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.జనసేన టికెట్లు కూడా చంద్రబాబే డిసైడ్ చేయాలన్న సజ్జల జనసేనకు ఇచ్చే 24 సీట్లలో కూడా చంద్రబాబు అభ్యర్థులే ఉంటారని తెలిపారు.తాను పోటీ చేసే సీటుపై కూడా పవన్ కల్యాణ్ కు క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ఇంటికెళ్లి అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎవరిపై యుద్ధం చేస్తారని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే పవన్ టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే మంచిదని సూచించారు.