ప్రస్తుత కాలంలో సినిమా షూటింగులు జరుగుతున్నాయి అంటే హీరో హీరోయిన్లకు ఇతర చిత్ర బృందానికి తప్పనిసరిగా క్యారవాన్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.ఇకపోతే స్టార్ సెలబ్రిటీలు అయితే సొంతంగా కోట్లు ఖర్చు చేసి వారి ఇష్టాలకు అనుకూలంగా క్యారవాన్ డిజైన్ చేయించుకుంటున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలు హీరోయిన్లకు ఎంతో విలువైన క్యారవాన్లు ఉన్నాయి.ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక సైతం తనకు ప్రత్యేకంగా క్యారవాన్ ఏర్పాటు చేయించుకున్నారు.
ఈమె కూడా కెరియర్ మొదట్లో యాంకర్ గా బుల్లితెరకు పరిచయమై అనంతరం హీరోయిన్ గా వెండితెరపై నటించారు.అయితే వెండితెరపై పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోవడంతో నిహారిక వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారడమే కాకుండా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.
ఇక ఈమె షూటింగ్ లొకేషన్లో ఉన్నారంటే తప్పనిసరిగా క్యారవాన్ ఉండాల్సిందే.అయితే తాజాగా తన క్యారవాన్ గురించి చెబుతూ తన క్యారవాన్ లో తప్పనిసరిగా ఉండాల్సిన ఒక వస్తువు గురించి తెలిపారు.

నిహారిక ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే జొన్నల గడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే వీరి వివాహమైన తర్వాత చైతన్య నిహారికకు మొదటి గిఫ్ట్ గా బజ్ అనే ఒక కుక్క పిల్లను గిఫ్ట్ గా ఇచ్చారు.ఇక అదంటే నిహారికకు ఎంతో ఇష్టం.ఇకపోతే తన భర్త చైతన్యతో కలిసి నిహారిక తన పెట్ బజ్ కలిసి దిగిన ఫోటో తప్పనిసరిగా తన కేరవాన్ లో ఉంటుందని నిహారిక ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇక ప్రస్తుతం ఈమె హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.