ఆపిల్ స్మార్ట్ ఫోన్ గురించి అందరికీ తెలిసిందే.మార్కెట్లో దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ఎందుకంటే., ఇందులో ఉన్న ఫీచర్స్ అలాంటివి మరి.అయితే ఆపిల్ కంపెనీ ఇటీవల ప్రారంభించిన కొత్త ఆపరేటింగ్ సిస్టం ఐఓఎస్ అప్డేట్ విషయంలో ఫేస్బుక్ కి, ఆపిల్ కి మధ్య వివాదం చెలరేగింది.
ఆపిల్ వ్యవస్థాపకుడు టిమ్ కుక్ అప్డేట్ చేసిన iOS 14 లో ఐడెంటిఫైర్ ఫర్ అడ్వర్టైజర్ ( ఐడిఎఫ్ఏ) ఫీచర్ ప్రకటనకర్తలును గుర్తిస్తుంది.
వినియోగదారులు వారిని బ్లాక్ చేయాలనుకుంటే శాశ్వతంగా బ్లాక్ చేసే అవకాశం ఉండడంతో ఐఫోన్ లో ఫేస్బుక్ యూజర్లకు అనుగుణంగా ప్రకటనను అందించలేకపోతుంది.ఆపిల్ ప్లాట్ఫారం లోని పిక్సెల్ టూల్ సాయంతో వినియోగదారుల బ్రౌజింగ్ చరిత్ర శోధించిన ఉత్పత్తుల మేరకు ఫేస్బుక్ ప్రేక్షకులకు అనుగుణంగా ప్రకటనలను చూపించేది.
అయితే iOS 14 అప్డేట్ రావడంతో ఫేస్బుక్ ఈ పని చేయలేక పోయింది.దీని వల్ల ప్రకటన ద్వారా వచ్చే ఆదాయాన్ని ఫేస్బుక్ చాలావరకు కోల్పోయింది.
ఫేస్బుక్ పనితీరు పై విక్రయదారుడు ఆరోన్ పాల్ తో కంపెనీ బడ్జెట్ నిరంతరం మారుతూ ఉంటుందని పాల్కు చెందిన కారౌసెల్ కంపెనీ ఫేస్బుక్ లో రోజుకు మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది.కానీ ఐఓఎస్ లో మార్పుకు ముందు ఫేస్బుక్ లో 100% ట్రాఫిక్ దాని ప్రోడక్ట్ పేజీకి వెళ్లలేదని ప్రస్తుతం అది కాస్త 20% కి తగ్గిపోయింది.

పండుగల సీజన్ లో కూడా ఫేస్బుక్ తన ప్రకటనల వ్యాపారం నిరంతరంగా క్షీణిస్తుంది.దీంతో ఫేస్బుక్ షేర్ ధరపై కూడా ప్రభావం పడింది.స్నాప్ చాట్, టిక్ టాక్ వంటి ప్లాట్ఫారం లను కూడా ఆపిల్ అప్డేట్ తీవ్రంగా ప్రభావం చూపిస్తోందని, అలాగే ఫేస్బుక్ తో సహా ఈమెయిల్ లను కూడా ప్రభావితం చేస్తుందని తెలిపారు.
ఏప్రిల్ 26న iOS 14 ప్రారంభించినప్పుడు ఫేస్బుక్ షేరు ధర 303 డాలర్లుగా ఉండేది.
సెప్టెంబర్ 14న ఐ ఫోన్ లాంచ్ అయినప్పుడు అది కాస్త 376 డాలర్ల వద్దకు చేరుకుంది.ప్రస్తుతం ఆపిల్ అప్డేట్ చేయడంతో 324 డాలర్లుగా ఉంది.
దీంతో ఆపిల్ కొత్త అప్డేట్ ప్లాట్ ఫాంలో చేసిన ప్రకటనలను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఫేస్బుక్ కంపెనీ ఆపిల్ పై ఆరోపణలు గుప్పించింది.