ఫలించిన ఇస్రో ప్రయోగం.. కక్ష్యలోకి పీఎస్ఎల్వీ సి 51 రాకెట్.. !

మొట్టమొదటి సారిగా ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యంతో ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి 51 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది.కాగా ఆదివారం ఉదయం 10.

23 గంటలకు పీఎస్ఎల్వీ ద్వారా ఈ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపిందట.ఇకపోతే పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 53 వ ప్రయోగంగా పేర్కొంటున్నారు అధికారులు.

కాగా ఈ రాకెట్ ద్వారా మొత్తం 19 ఉపగ్రహాలను నింగిలో ప్రవేశపెట్టారు.ఇందులో 5 ప్రైవేట్ ఉపగ్రహాలు కాగా, 14 దేశీయ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు.ఇక నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లాంచింగ్ ప్యాడ్-1 నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ కౌంట్‌డౌన్ నిన్న ఉదయం 8.54 గంటలకు ప్రారంభమయ్యిందట.అలా 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.

ఇక నాలుగు దశల్లో ఆ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ఉంచారు.కాగా ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ ప్రయోగం విజయవంతం అవడంతో శాస్త్రవేత్తలు తమ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
పుష్ప 2 లో శ్రీ వల్లి ని చంపేది ఎవరో తెలుసా..?

తాజా వార్తలు