తల, మెడను అతికించారు.. వైద్య రంగంలో సంచలనం

రోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు( Road Accidents ) చోటుచేసుకుంటూ ఉంటాయి.ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు.

 Israeli Doctors Reattach Boys Head After He Was Hit By A Car Details, Head ,neck-TeluguStop.com

మరికొంతమంది తీవ్ర గాయాలపాలై చేతులు, కాళ్లు కోల్పోయి దివ్యాంగులుగా మారిపోతూ ఉంటారు.రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి.

అయితే రోడ్డు ప్రమాదాల తీవ్రతను బట్టి కొంతమంది శరీర భాగాలకు గాయలవుతూ ఉంటాయి.భారీ ప్రమాదం సమయంలో శరీర భాగాలు పార్ట్‌లు పార్ట్‌లుగా విడిపోతాయి.

ఇలాంటి సమయంలో క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటం కష్టతరమవుతుంది.

Telugu Docters, Neck Reattach, Israel, Israeli Doctors, Medical Miracle, Neck, R

అయితే తాజాగా వైద్యశాస్త్రంలో అద్భుతం చోటుచేసుకుంది.రోడ్డు ప్రమాదంలో తల, మెడ విరిగిపోగా.( Head Neck ) వాటిని తిరిగి వైద్యులు అతికించారు.

ఇస్రాయెల్‌లో( Israel ) ఈ ఘటన చోటుచేసుకుంది.ఇస్రాయెల్‌కి చెందిన సులేమాన్ హాస్సాన్( Suleiman Hassan ) అనే 12 ఏళ్ల బాలుడు సైకిల్ పై వెళుతుండగా.

కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బాలుడి వెన్నెముక పైభాగాన ఉండే వెన్నుపూస నుంచి పుర్రె వేరైంది.

Telugu Docters, Neck Reattach, Israel, Israeli Doctors, Medical Miracle, Neck, R

పుర్రె వేరు కావడంతో బాలుడు బ్రతికే అవకాశం లేదని అందరూ ఆశలు వదిలేసుకున్నారు.కానీ బాలుడికి చికిత్స చేసి వైద్యులు బ్రతికించారు.ఎమర్జెన్సీ సర్జరీ నిర్వహించి మెడ, పుర్రను అతికించి కాపాడారు.శరీరం దెబ్బతిన్న భాగంలో కొత్త ప్లేట్స్ బిగించి కాపాడారు.

అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఈ చికిత్స చేశామని, సర్జరీ( Surgery ) కొన్ని గంటలపాటు పట్టినట్లు ఆపరేషన్ చేసిన డాక్టర్లు( Doctors ) తెలిపారు.బాలుడు బ్రతకడం చూసి తాము ఆశ్చర్యపోయినట్లు చెప్పారు.

బాలుడికి ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన హదర్సా మెడికల్ సెంటర్ కు తరలించారు.దీంతో వెంటనే వైద్యులు సర్జరీ చేశారు.

వెన్నుపూస నుంచి పుర్రె వేరు కావడాన్ని వైద్య భాషలో బైలేటరల్ అట్లాంటో అక్సిపిటల్ జాయింట్ డిసో లోకేషన్ గా పిలుస్తారు.ఇలా జరిగినవారు బ్రతకడం దాదాపు కష్టమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube