మానసిక ఒత్తిడికి లోనైన ఇషాన్ కిషన్.. క్రికెట్ కెరీర్ పై కీలక నిర్ణయం..!

భారత జట్టు యువ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్( Wicket keeper Ishan Kishan ) మానసిక ఒత్తిడికి లోనై.

క్రికెట్ కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకున్నాడు.

మానసిక ఒత్తిడిని అధిగమించడం కోసం కొన్నాళ్లపాటు క్రికెట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడే భారత జట్టులో స్థానం లభించిన.

సిరీస్ ఆడకుండా స్వదేశానికి తిరిగి వచ్చాడు.ఈ విషయంపై బీసీసీఐ కానీ ఇషాన్ కిషన్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఇషాన్ కిషన్ సౌత్ ఆఫ్రికా పర్యటన నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

క్రికెట్ నుంచి కొన్నాళ్లపాటు తనకు విరామం కావాలని బీసీసీఐ ( BCCI )మేనేజ్మెంట్ ను కోరడంతో, ఇషాన్ కిషన్ మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని అతని విన్నపాన్ని బీసీసీఐ అంగీకరించినట్లు ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు.ఇషాన్ కిషన్ రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.అడపాదడపా అవకాశాలు వచ్చే ఇషాన్ కిషన్ కు రిషబ్ పంత్( Rishabh Panth ) రోడ్డు ప్రమాదం కారణంగా.

Advertisement

పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ కు వరుస అవకాశాలు వచ్చాయి.చేతికి వచ్చిన అవకాశాలను చాలా బాగా సద్వినియోగం చేసుకున్నాడు.

భారత జట్టులోకి కేఎల్ రాహుల్ ( KL Rahul )తిరిగి రావడం, ఓపెనర్ గా శుబ్ మన్ గిల్ నుంచి పోటీ నెలకొనడంతో ఇషాన్ కిషన్ బెంచ్ కే పరిమితం అయ్యాడు.ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో కూడా దాని ఇషాన్ కిషన్ బెంజ్ కే పరిమితమయ్యాడు.దీంతో ఇషాన్ కిషన్ లో మానసిక ఒత్తిడి పెరిగింది.

సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడే జట్టుకు ఎంపికైన కూడా.మానసిక ఒత్తిడి కారణంగా సిరీస్ ఆడే జట్టు నుండి తప్పుకున్నాడు.2023 ఏడాదిలో ఇషాన్ కిషన్ రెండు టెస్ట్ మ్యాచ్ లతోపాటు 17 వన్డేలు, 11 టీ20 మ్యాచ్ లు ఆడాడు.మొత్తం 29 ఇన్నింగ్స్ లలో 741 పరుగులు చేశాడు.

ఇందులో ఒక డబల్ సెంచరీ, ఒక సెంచరీ, ఏడు అర్థ సెంచరీలు ఉన్నాయి.ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2024 వరకు క్రికెట్ కు దూరంగా ఉండి, అంతవరకు విరామం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు