బ్రిటిష్ రెస్టారెంట్‌ స్టోర్లు ఇండియా అంతటా తీసుకొస్తున్న ఇషా అంబానీ.. ఆ వివరాలు ఇవే..

ముఖేష్ అంబానీ, అతని కుమార్తె ఇషా అంబానీకి( Isha Ambani ) చెందిన రిలయన్స్ బ్రాండ్స్ తాజాగా ప్రముఖ బ్రిటిష్ రెస్టారెంట్ చైన్ అయిన ప్రెట్ ఎ మాంగర్‌తో( Pret A Manger ) ఒప్పందం కుదుర్చుకున్నాయి.తరువాత రిలయన్స్‌తో( Reliance ) ప్రత్యేక పార్ట్‌నర్‌షిప్ ద్వారా ఇండియాలో మొట్టమొదటి ప్రీట్ ఎ మాంగర్ స్టోర్‌ను కూడా లాంచ్ చేసాయి.

 Isha Ambani Bring Iconic British Restaurant To India Details, Reliance Brands, P-TeluguStop.com

ఇషా అంబానీతో అనుబంధం ఉన్న రిలయన్స్ రిటైల్, రిలయన్స్ బ్రాండ్స్ ఈ సహకారాన్ని సులభతరం చేశాయి.ఢిల్లీ, బెంగళూరులలో రిచ్ ఏరియాలలో భారతదేశమంతటా మొత్తం 10 ప్రెట్ ఎ మాంగర్ రెస్టారెంట్‌లను ప్రారంభించాలనేది ఇషా అంబానీ ప్రణాళిక.

ఇండియాలో టీ, కాఫీ షాపులకు ప్రజలు పోటెత్తడం కామన్.ఈ డిమాండ్ ను బట్టి ప్రెట్ ఎ మ్యాంగర్‌ను భారతదేశానికి తీసుకురావాలనే ఇషా అంబానీ నిర్ణయించారు.టాటా గ్రూప్‌లో భాగమైన స్టార్‌బక్స్ ఇండియాకు ఈ స్టోర్లు పోటీగా నిలవనున్నాయి.ప్రెట్ ఎ మ్యాంగర్‌లో అనేక రకాల కాఫీ, టీ వెరైటీలు దొరుకుతాయి

Telugu Bangalore, British, Delhi, Isha Ambani, Mukesh Ambani, Nership, Pret Mang

ముఖేష్, ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ ఈ విదేశీ బ్రాండ్‌ను పరిచయం చేయడం ద్వారా భారతదేశంలోని ఆహార, పానీయాల పరిశ్రమలోకి ప్రవేశం చేస్తోంది.ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో మొదటి ప్రీట్ ఎ మాంగర్ స్టోర్ ఇప్పటికే తీసుకొచ్చింది.రిలయన్స్ బ్రాండ్స్ మేనేజింగ్ డైరెక్టర్, దర్శన్ మెహతా మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం తాజా పదార్థాలు,

Telugu Bangalore, British, Delhi, Isha Ambani, Mukesh Ambani, Nership, Pret Mang

టేస్టీ వంటకాలు, నాణ్యమైన ఆహారం, గుర్తించదగిన కాఫీ గింజలతో బెస్ట్ డ్రింక్స్ భారతీయులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.ప్రెట్ ఎ మ్యాంగర్‌ను భారతదేశానికి తీసుకురావడంతో పాటు, ముఖేష్, ఇషా అంబానీలు భారతదేశంలో గతంలో బ్యాన్ అయిన ప్రముఖ చైనీస్ దుస్తుల అప్లికేషన్ షీన్‌ను తిరిగి తీసుకురావాలని కూడా యోచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube