తెలంగాణ‌లో బీజేపీ వ్యూహం అదేనా..? అవినీతిని బ‌య‌ట‌పెట్టి..!!

అధికార పార్టీని గ‌ద్దెదించాలంటే బ‌ల‌మైన నినాదం లేవ‌నెత్తాల్సిందే.ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌లు బ‌లంగా వినిపించాల్సిందే.

 Is This The Strategy Of Bjp In Telangana Bring Out The Corruption Details, Cm Kc-TeluguStop.com

ఇలా అన్ని పార్టీలు అధికారం ద‌క్కించుకోవ‌డానికి చేసేవే.ఇక విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌లు స‌హ‌జం.

ఇక తెలంగాణలో కూడా కేసిఆర్ సర్కారును కూడా అధికారం నుంచి తప్పించాలనే వ్యూహాలు సహజంగాననే రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నాయి.మరీ ముఖ్యంగా రాష్ట్రాల్లో విస్తరించాలనే ప్రధాన కాంక్షతో ర‌గిలిపోతున్న‌ బీజేపీ మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది.

ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రత్యర్థి పార్టీల రాష్ట్రాలపైకాలు దువ్వుతూనే ఉంది.ఈ క్రమంలోనే అందివచ్చిన రాష్ట్రాల్లో కమల నాథులు విస్తరిస్తున్నారు.

ఇక సౌత్ పై ఫోక‌స్ పెట్టిన బీజేపీఎలాగైనా తెలంగాణ‌లో విస్త‌రించాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.అయితే తెలంగాణ‌లో విస్తరించడం.

పాగా వేయడం.అధికార పగ్గాలు చేపట్టడం బీజేపీకి అంత ఈజీకాద‌నే చెప్పాలి.ఇక్క‌డ‌ కేసీఆర్ వాదాన్ని అడ్డుకుని తెలంగాణ సెంటిమెంటును తమవైపు తిప్పుకోవడం మామూలు విష‌యం కాదు.

బీజేపీకి తెలిసిన ఆయుధాలే ఇక్క‌డ‌

అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ బ‌ల‌మైన క్యాడర్, నాయకులు ఉన్నారు.ఆ స్థాయిలో ఇక్క‌డ బీజేపీ ఇంకా పుంజుకోలేద‌ని అంటారు.మ‌రి ఏదో ఒక సంచ‌ల‌నం సృష్టించి త‌మ‌వైపున‌కు తిప్పుకోవాలంటే ఏం చేయాల‌నే ఆలోచ‌న‌లో ఢిల్లీ పెద్ద‌లు ఉన్నార‌ట‌.

ఇక సాధారణంగా.బీజేపీ ప్రయోగించే అస్త్రాల్లో కీలకమైన అవినీతి ఆరోపణలు.

సీబీఐ ఈడీ.వంటివాటిని ప్రయోగించే అవకాశం ఎక్కువగా ఉంది.ఇక మొద‌టి నుంచి కూడా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని ఆరోపిస్తున్నారు.

Telugu Amit Sha, Cm Kcr, Delhi, Kaleshwaram, Mlc Kavitha, Narendra Modi, Telanga

ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ పెద్దలు ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేసీఆర్ కుమార్తె పేరు ను బయటకు లాగారు.అయితే ఇందులో ఇంకా వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డ‌లేదు.కాగా ఎమ్మెల్సీ క‌విత ఇప్పటికే పరువునష్టం దావా వేయడంతో బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు.

అయినా కూడా బీజేపీ ఏదో ఒకరకంగా కేసీఆర్ సహా ఆయన కుటుంబ పాలనపై అవినీతి మరకలు అంటించిప్రజల్లోకి తీసుకవెళ్లాలనే వ్యూహాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇది సక్సెస్ అయింది.

ఇదే వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయడం ద్వారా ప్రజల్లోనే కేసీఆర్ పట్ల వ్యతిరేకత వస్తే దానిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంద‌ని అంటున్నారు.మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube