7/జీ బృందావన కాలనీ రీ రిలీజ్ డిజాస్టర్ కావడం వెనుక అసలు కథ ఇదేనా?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఆయా హీరోల పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన సూపర్ హిట్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ అయిన సినిమాలను కూడా థియేటర్ లో మరోసారి విడుదల చేస్తున్నారు.

 Is This The Real Story Behind The 7/g Vrindavan Colony Re-release Disaster , 7/g-TeluguStop.com

ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, చిరంజీవి బాలకృష్ణ నటించిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి.

మరి కొన్ని సినిమాలు పరవాలేదు అనిపించేలా కలెక్షన్స్ ను సాధించాయి.ఇది ఇలా ఉంటే తాజాగా 7 /జి బృందావన్ కాలనీ( 7/G Brundavan Colony ) సినిమా థియేటర్లో చాలా ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

Telugu Selva Raghavan, Sonia Aggarwal, Tollywood-Movie

అయితే చాలా వరకు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతతో ఎదురు చూశారు.ఇక ఇటీవల శుక్రవారం ఎలాంటి పోటీ లేకుండా మంచిసమయం చూసుకుని విడుదల ప్లాన్ చేయడంతో హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయమని అందరూ భావించారు.కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్టు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది.తాజాగా విడుదల అయిన ఈ మూవీ కలెక్షన్స్ చాలా దారుణంగా ఉన్నాయి.

హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ మినహాయించి ఈ సినిమాకు ఆశించిన స్పందన రాలేదని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి.ముఖ్యంగా జిల్లా కేంద్రాలు, పట్టణాలు చాలా చోట్ల సగం ఆక్యుపెన్సీ లేక బయ్యర్లు డీలా పడ్డారు.

కాంపిటీషన్ లేదు కాబట్టి యువత మూవీ కోసం ఎగబడతారని వేసిన అంచనా పూర్తిగా తప్పింది.

Telugu Selva Raghavan, Sonia Aggarwal, Tollywood-Movie

ఫస్ట్ డే కోటి రూపాయలకు పైగా వచ్చిందని నిర్మాతలు ప్రకటించుకున్నారు కానీ అందులో వాస్తవమెంతో చెప్పలేం.ఆర్టిసి క్రాస్ రోడ్స్, వైజాగ్, విజయవాడ లాంటి ప్రధాన కేంద్రాల్లో మాత్రమే సందడి కనిపించింది తప్ప మిగిలిన చోట్ల రెస్పాన్స్ సోసోనే.వినాయక చవితి ఫెస్టివల్ ( Vinayaka Chavithi Festival )ఉండటంతో యువత అలాగే చాలా మంది టికెట్లకు ఖర్చు పెట్టే డబ్బులు మిగిలించుకుంటే నిమజ్జనం రోజు ఎంజాయ్ చేయొచ్చనే ఆలోచనతో సినిమా ఆప్షన్ ని లైట్ తీసుకున్నారు.

దీంతో ఆ ప్రభావం నేరుగా కలెక్షన్ల మీద పడింది.దీనికి తోడు గత మూడు నెలల్లో రీ రిలీజులు విపరీతంగా వచ్చేసి ఆడియెన్సు జేబులకు గట్టిగానే చిల్లులు పెట్టాయి.

దాంతో సహజంగానే నెలాఖరు దగ్గరగా ఉన్న టైంలో సైలెంటైపోయారు.ఇలా ఒక క్లాసిక్ కి దక్కాల్సిన గౌరవమైతే రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube