షర్మిల పార్టీపై కేసీఆర్ వ్యూహం ఇదేనా?

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కొత్త పార్టీతో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపారు.కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు ప్రముఖులు తెలంగాణలో షర్మిల ఎంట్రీపై విమర్శలు గుప్పిస్తుండగా.

 Is This Kcr S Strategy Against Sharmila S Party , Kcr , Strategy , Sharmila ,-TeluguStop.com

టీఆర్ఎస్ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చింది. షర్మిలపై కామెంట్లు కూడదంటూ ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు కూడా వార్తలొచ్చాయి.

అయినాసరే, కేసీఆర్ కు అత్యంత ఆప్తులుగా ముద్రపడిన మంత్రులు కొందరు షర్మిలపై మాటల బాణాలు వదులుతూనే ఉన్నారు.

టీఆర్ఎస్ రాష్ట్ర మంత్రి గంగుల వైఎస్ షర్మిల కొత్త పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

షర్మిల కొత్త పార్టీ ఎందుకు పెడుతున్నదో కారణాలను వివరిస్తూ.ఆమెను అడ్డుకోడానికి తెలంగాణ సమాజం ఏం చేయాలో గంగుల వివరించారు.

తెలంగాణలో వైసీపీకే అభిమానులు లేరని, అలాంటప్పుడు షర్మిలకు ఎక్కడి నుంచి వస్తారని, రాయలసీమ ఫ్యాక్షన్ కుయుక్తులు ఇక్కడ చెల్లబోవంటూ గత వారం కామెంట్లు చేసిన మంత్రి గంగుల.ప్రెస్ మీట్ లో ఇంకాస్త డోసు పెంచారు.

Telugu Congress, Gangula, Harish Rao, Itala Rajender, Sharmila, Strategy, Trs-Po

షర్మిల పార్టీపై కేసీఆర్ వ్యూహం ఇదేనా? తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ వ్యవహారంపై టీఆర్ఎస్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.మంత్రులు మాత్రం తరచూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.మంత్రి ఈటల రాజేందర్ ఇటీవలే షర్మిల పార్టీపై మత కోణంలో పరోక్ష విమర్శలు చేశారు.తెలంగాణ రైతులకు ఏరకంగా అన్యాయం జరిగిందో చెప్పాలని మరో మంత్రి హరీశ్ రావు.

షర్మిల పార్టీని నిలదీశారు.ఇప్పుడు మంత్రి గంగుల కమలాకర్ ఏకంగా షర్మిల పార్టీని ఆంధ్రా భూతంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

ఈ పరిణామాలన్నీ పరోక్షంగా కేసీఆర్ స్ట్రాటజీని వెల్లడిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ కు హోరాహోరీ పోరు తప్పని పరిస్థితుల్లో.

కాంగ్రెస్-టీడీపీలు జత కట్టడం, తెలంగాణలో ప్రచారానికి చంద్రబాబు సైతం సిద్ధం కావడం టీఆర్ఎస్ కు లాభించింది.కాంగ్రెస్ కు ఓట్లేస్తే చంద్రబాబుకు వేసినట్లేనని, తద్వారా ఆంధ్రా శక్తులు మళ్లీ పుంజుకుంటాయని కేసీఆర్ ప్రచారం చేశారు.

చంద్రబాబు ద్వారా లబ్దిపొందామని పరోక్షంగా అంగీకరించిన కేసీఆర్.బాబుకు రిటర్న్ గిప్టు కూడా ఇస్తామన్నారు.

ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా సాగుతోన్న రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ ద్వారా మళ్లీ ఆంధ్రా బూచిని ప్రచారాస్త్రంగా టీఆర్ఎస్ వాడుకోబోతోందని మంత్రుల వ్యాఖ్యలతో తేటతెల్లం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube