రాష్ట్రంలో మంత్రి వర్గం మార్పుపై ముఖ్యమంత్రి జగన్ వ్యూహం మార్చుకున్నారా? ఇప్పటివరకు ఉన్న వారిని మార్చేందుకు రెడీ అయినప్పటికీ.అందరికీ అవకాశం కల్పించాలనే కాన్సెప్ట్ విషయంలో ఒకింత గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అసంతృప్తి కనిపిస్తోంది.దీనిని దృష్టిలో పెట్టు కున్న.
జగన్.అందరికీ అన్నీ.
అనే తరహాలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యం లో రెండున్నరేళ్లకుకాకుండా మూడేళ్ల తర్వాత.
మంత్రి వర్గాన్ని మార్చాలని తాజాగా నిర్ణయించుకున్న ట్టు సమాచారం.
ప్రస్తుత మంత్రి వర్గంలో సీనియర్లు, జూనియర్‌లు కూడా ఉన్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.మళ్లీ చేపట్టబోయే విస్తరణలో అవకాశం కోసం మరింత మంది ఎదురు చూస్తున్నారు.కానీ,, సంఖ్యాపరంగా చూసుకుంటే మాత్రం.25 కు మించరాదనే రాజ్యాంగ పరిమితి ఉన్నందున.జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని.మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయాలని.
జగన్ భావిస్తున్నట్టు సమాచారం.అంటే.
జిల్లాకుఒక్కరిని తీసుకుంటే.ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నట్టు సమాచారం.
ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి.

దీంతో ఒక్కొక్క జిల్లా నుంచి ఇద్దరు.మరికొన్ని జిల్లాల నుంచి ముగ్గురుని మంత్రులుగా తీసుకున్నారు.అయితే.
దీనివల్ల.నాయకుల్లో అసంతృప్తి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే త్వర లోనే జిల్లాల ఏర్పాటు జరుగుతుంది కనుక అప్పటి వరకు వెయిట్ చేసి.ఆతర్వాత.
జిల్లాకు ఒక్కొక్కరు చొప్పున.అవకాశం కల్పించాలని చూస్తున్నారట.
మొత్తం 25 నుంచి 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని.జగన్ భావిస్తున్నారు.
దీంతో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేందుకు అవకాశం ఉందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.అప్పుడు కొత్తవారికి కూడా అవకాశం చిక్కడంతోపాటు.ప్రతి జిల్లా నుంచి మంత్రులకు అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది.దీంతో ఇదంతా పూర్తయ్యేందుకు కనీసం ఈ ఏడాది చివరివరకు సమయం పట్టొచ్చని అంటున్నారు.