సంజయ్ వ్యతిరేక వర్గానికి ఇది ఎదురుదెబ్బే ? 

ఇటీవల కాలంలో తెలంగాణ బిజెపిలో( BJP ) గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలయించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా వ్యవహరించడం, బిజెపి హై కమాండ్ వద్ద తమ పలుకుబడిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుండడం, తదితర వ్యవహారాలన్నీ తెలంగాణ బిజెపిలో కాకర రేపుతూనే వచ్చాయి.

 Is This A Setback For The Anti-sanjay Group, Telangana Bjp, Bandi Sanjay, Brs, K-TeluguStop.com

ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్( Bandi Sanjay ) పదవీకాలం ముగియడంతో,  ఆయన స్థానంలో మరొకరిని నియమించాలనే విజ్ఞప్తులు కొంతమంది బీజేపీ కీలక నాయకులు పార్టీ హై కమాండ్ వద్ద విన్నవించేవారు.అంతేకాకుండా సంజయ్ మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ ఆయనపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ అధిష్టానం దృష్టిలో ఆయనను చులకన చేసే ప్రయత్నం చేయడం వంటి సంఘటనలు ఎన్నో తెలంగాణ బిజెపిలో చోటుచేసుకున్నాయి.

Telugu Bandi Sanjay, Kavitha, Telangana Bjp, Telanganabjp, Telangana, Tharun Chu

ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( Kavitha ) ఢిల్లీ లిక్కర్ స్కాం కుంభకోణంలో ఉండడంతో , ఆమెపై బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ.ఆయనను మార్చాలంటూ తెలంగాణ బిజెపి నేతలు బహిరంగంగా మాట్లాడడం వంటివి తెలంగాణ బీజేపీ లోని గ్రూపు రాజకీయాలను తెరపైకి తెచ్చాయి.కవిత లిక్కర్ స్కాంపై ( Kavita Liquor Scam )స్పందించిన బండి సంజయ్.నేరం చేస్తే జైల్లో పెట్టక ముద్దు పెట్టుకుంటారా అంటూ కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ( BRS )తో పాటు, బిజెపిలోని సంజయ్ వ్యతిరేక వర్గం తప్పు పట్టింది.

ముఖ్యంగా నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ సంజయ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు .అలాగే బిజెపిలో కీలకంగా వ్యవహరించే శేఖర్ రావు వంటి వారు సంజయ్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు.

Telugu Bandi Sanjay, Kavitha, Telangana Bjp, Telanganabjp, Telangana, Tharun Chu

అయితే వీరందరికీ గట్టి షాక్ ఇచ్చే విధంగా బిజెపి హై కమాండ్ ప్రకటన చేసింది.ఈ మేరకు  తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్చార్జి తరుణ్  చుగ్ ప్రకటన చేశారు.2024 లో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని , అప్పటి వరకు బండి సంజయ్ ను మార్చే ప్రసక్తే లేదంటూ తరుణ్ చుగ్ ప్రకటించడం సంజయ్ వ్యతిరేక వర్గానికి షాక్ ఇచ్చినట్లయ్యింది.దీంతో తెలంగాణలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సంజయ్ వ్యతిరేక వర్గం ఆయనకు ఎంత వరకు సహకరిస్తుందనేది తెలయాల్సి ఉంది.

ఏది ఏమైనా సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని ఆశలు పెట్టుకున్న ఆయన వ్యతిరేక వర్గానికి తరుణ్ చుగ్ ప్రకటన తీవ్ర నిరాశ కలిగించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube