టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అనుష్క( Anushka Shetty ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడు అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటుంది కానీ ఒకప్పుడు మాత్రం ప్రతి ఒక్క దర్శక నిర్మాత ఈ బ్యూటీనే ఎంచుకునేవాళ్లు.
స్టార్ హీరోలు సైతం తమ సినిమాలలో మొదట అనుష్క హీరోయిన్ గా తీసుకునే వాళ్ళు.
ఇక ఇప్పుడు కొత్త హీరోయిన్ల రాకతో పైగా అనుష్క లుక్ లో కూడా మార్పు రావడంతో అవకాశాలు అంతంత మాత్రమే ఉన్నాయి.ప్రస్తుతం తను నవీన్ పొలిశెట్టితో ఒక సినిమా( Miss Shetty Mr Polishetty )చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక అనుష్కకు అభిమానుల సంఖ్య బాగానే ఉందని చెప్పాలి.
ఒకప్పుడు తన అందాలతో ప్రతి ఒక్కరిని తన వైపుకు మలుపుకుంది.హైటుకు తగ్గట్టు పర్సనాలిటీతో స్టార్ హీరోలను సైతం ఫిదా చేసింది.
కానీ ఆ మధ్య బాగా లావై తన ఫిజిక్ మొత్తం కోల్పోయింది.మళ్లీ మునుపటి రూపం తెచ్చుకోవడానికి ప్రయత్నించింది కానీ అది సాధ్యం కాలేకపోయింది.దీంతో ఆమె తన ఫిజిక్ వల్ల కూడా వచ్చిన అవకాశాలను కూడా కోల్పోయింది.కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అవి అంత సక్సెస్ కాలేకపోయాయి.దీంతో అనుష్క టైం అయిపోయింది అని చాలామంది అనుకున్నారు.
కానీ ఇప్పటికీ ఆమెను అభిమానించే ప్రేక్షకులు ఉన్నారని చెప్పాలి.
ఇక ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమా ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం ఓకే కానీ ప్లాఫ్ అయితే అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పడం ఖాయమని చెప్పాలి.ఇదంతా పక్కన పెడితే అనుష్క అసలు పేరు స్వీటీ( Anushka Real name Swweety ).
తన తల్లితండ్రులు తనకు స్వీటీ అనే పేరుతో నామకరణం చేశారు.
అలా స్వీటీ అనే పేరుతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు.ఇండస్ట్రీలోనే అనుష్క అనే పేరు వచ్చింది.అయితే ఈమెకు ఈ పేరు రావడానికి కారణం నాగార్జున అని తెలుస్తుంది.
ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అనుష్క నాగార్జునతో డైరెక్టర్ పూరీ కాంబినేషన్లో సూపర్ సినిమా( Super Movie )లో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.అయితే ఈ సినిమా సమయంలో నాగార్జున అనుష్కను నీ పేరేంటి అని అడగటంతో స్వీటీ అని చెప్పిందట అనుష్క.
దాంతో అసలు పేరు ఏంటి అని నాగార్జున అడగటంతో అదే తన పేరు చెప్పగా నాగార్జున డౌట్ తో పాస్పోర్టు కూడా అడిగాడట.అందులో కూడా తన పేరు స్వీటీ అని ఉండటంతో.
ఒక హీరోయిన్ కి స్వీటీ అని పేరు సెట్ అవ్వదు ఈ అమ్మాయికి మంచి పేరు పెట్టాలి అని డైరెక్టర్ పూరీ( Director Puri jagannath )తో అన్నాడట.
అయితే అదే సమయంలో తమ స్టూడియోకి ఒక సింగర్ అనుష్క అనే అమ్మాయి రావడంతో.
నాగార్జున( Nagarjuna ) ఆమె పేరు విని ఈ పేరు ఎక్కడ లేదు అని స్వీటీకి ఈ పేరు పెడితే బాగుంటుంది అని అనుష్క అని పిక్స్ చేశాడట.దీంతో అనుష్క కూడా రెండు రోజులు ఆ పేరుతో నన్ను పిలవండి.
నాకు అలవాటు అవుతుందో లేదో అని అనటంతో ఆ రోజు నుంచి అనుష్క అని పిలవటంతో అదే అలవాటు అయ్యిందని తెలిసింది.ఇక ఈ విషయాన్ని గతంలో పూరి ఓ సినిమా ఈవెంట్ లో తెలిపాడు.