తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా?.. షర్మిల కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Is There Democracy In Telangana?.. Sharmila's Key Comments-TeluguStop.com

పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదని షర్మిల స్పష్టం చేశారు.అదేవిధంగా అరెస్ట్ చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని షర్మిల ప్రశ్నించారు.పోలీస్ శాఖ కేసీఆర్ కోసమే పని చేస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని నిలదీశారు.పోలీసులను తాలిబన్ సైన్యంలా కేసీఆర్ వాడుకుంటున్నారని మండిపడ్డారు.

మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారన్నారు.కేసీఆర్ ఆస్తులు మాత్రం పెరిగాయని ఎద్దేవా చేశారు.

తెలంగాణను దోచుకోవడం అయిపోయిందన్న షర్మిల ఇప్పుడు దేశంపై పడ్డారని విమర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube