ఇలాంటి బెదిరింపులతో ఒరిగేది ఉందా కౌశిక్  ?

రకరకాల హామీలు,  ప్రలోభాలతో  ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు , ఆ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ప్రయత్నిస్తూ ఉంటారు.  ఎన్నికల సమయంలో ఇదంతా సాధారణ వ్యవహారమే.

 Padi Koushik Reddy, Hujurabad, Etela Rajendar, Telangana Elections , Te-TeluguStop.com

ఎన్నికల సమయంలో ఓటర్లు దేవుళ్లు లా కనిపిస్తుంటారు.ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తరహా ఎన్నికల ప్రచారం జరుగుతుండగా , బీఆర్ఎస్ నుంచి హుజురాబాద్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి( Padi koushik Reddy ) బెదిరింపు ధోరణితో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు .ఈసారి జరిగే ఎన్నికల్లో తనను గెలిపించకపోతే .భార్య బిడ్డతో కలిసి ఉరి వేసుకుంటానని కౌశిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Congress, Etela Rajendar, Hujurabad, Telangana-Politics

 తనను చంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం అంటూ ఓటర్లను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు.  డిసెంబర్ 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, ఆ రోజు  ఫలితాలలో తనను గెలిపిస్తే విజయ యాత్ర , ఓడితే మరుసటి రోజు శవ యాత్ర అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ఒక్కసారి తనకు అవకాశం కల్పించాలని , 30వ తేదీన కారు గుర్తుపై ఓటు వేసి తను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కౌశిక్ రెడ్డి కోరుతున్నారు. కౌశిక్ వ్యాఖ్యలు ( Padi koushik Reddy )తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Telugu Congress, Etela Rajendar, Hujurabad, Telangana-Politics

ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డి గెలుపు పై అనుమానాలు ఉండడంతో , చివరి ప్రయత్నం గా ఓటర్ల ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే విధంగా కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ,  హుజురాబాద్ నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్( Etela rajendar ) వరుసగా గెలుస్తూ వస్తున్నారు .ప్రతి గ్రామంలోనూ రాజేందర్ కు పట్టు ఉండడంతో , కౌశిక్ రెడ్డి కి గెలుపు పై అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయట.  అందుకే ఈ విధంగా  ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు కౌశిక్ దిగారు అనే విమర్శలు ఎన్నో వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube