ఇప్పట్లో ప్రతి ఇంట్లో ఇంటర్నెట్( Internet ) ఉండడం పరిపాటి అయింది.ఈ క్రమంలో చాలా మంది రాత్రిళ్ళు కూడా వైఫై ( WiFi ) ఆఫ్ చెయ్యకుండా అలాగే వుంచేస్తూ నిద్రపోతు వుంటారు.
కానీ ఇలా వైఫై రూటర్( WiFi Router ) ఆన్ లో ఉంచడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పగటి సమయం ఎలాగు ఈ వైఫై గోల తప్పదు.
రాత్రి కూడా దాన్ని అలా ఆన్ లో ఉంచితే చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలింది.
అవును, ఇపుడు ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే మీరెప్పుడూ వైఫై ఆఫ్ చెయ్యడం మరిచిపోరు.
రాత్రిపూట వైఫై ఆన్లోనే ఉంటే ఇల్లంతా రేడియేషన్ ప్రసారం జరుగుతుంది.ఈ రేడియేషన్ ఇంటి గోడలపైకి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందనే విషయాన్ని మీరు చదువుకొనే వింటారు.
వైఫై రూటర్ గార్డ్ ఉపయోగించని పక్షంలో ఈ రేడియేషన్ చాలా హాని చేస్తుందని చెబుతున్నారు.సాధారణంగా ఇపుడు సెల్ ఫోన్ పక్కన పెట్టుకుని పడుకునే వారు వందలో 90 శాతం మంది వున్నారు.
దాంతో వారికి కూడా ఈ రేడియేషన్ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది.వైఫై రాత్రి ఆప్ చేయడం వల్ల దాని ఆధారంగా పనిచేసే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు విశ్రాంతిలోకి వెళతాయి మనం గుర్తించుకోవాలి.

వైఫై రూటర్ను అలా రాత్రిపూట ఆన్ చేసిపెట్టడం వలన కలిగే దుష్పరిణామాలు:
1.రేడియేషన్ కారణంగా పీనియల్ గ్రంధి పనితీరు మందగిస్తుంది.ఈ గ్రంధి శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి చేస్తుంది కదా.రాత్రిపూట వైపై ఆన్ లోనే ఉంటే ఈ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది.
2.దాని ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులు సంభవించడం, కండరాల పనితీరు దెబ్బతినడం, శరీరంలో టాక్సిన్లు బయటకు పంపడంలో ఆంటకం ఏర్పడుతుంది.

3.మెల్లమెల్లగా మనలోని రక్షణ వ్యవస్థ (ఇమ్యూనిటీ పవర్) పనితీరు మందగిస్తుంది.దాంతో శరీర సామర్థ్యం ప్రభావితమవుతుంది.శరీరానికి కీలకమైన పోషకాలు గ్రహించే సామర్యం తగ్గిపోతుంది.శరీరంలో టాక్సిన్లు బయటకు పంపే వ్యవస్థ మందగిస్తుంది.రక్తం శరీరానికి సరిపడినంత ఆక్సిజన్ ను తీసుకెళ్ళలేదు.
ఇది మాత్రమే కాకుండా మెదడు పనితీరుమీదా.మెదడు కణాల మీదా ప్రభావం ఉంటుంది.
శరీరంలో కణాలు తొందరగా విచ్చిన్నం కావడం వల్ల మనిషి జీవిత కాలంకూడా తొందరగా ముగుస్తుంది.







