ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎక్కడ లేని హడావుడి పడుతోంది.పార్టీ శ్రేణులను పూర్తిగా జనాల్లో ఉండే విధంగా జగన్ అనేక కార్యక్రమాలు రూపొందించారు.
అంతేకాదు తాడేపల్లి క్యాంపు కార్యాలయంకే ఎక్కువగా పరిమితం అవుతూ వస్తున్న జగన్ గత కొంతకాలంగా తరచుగా జిల్లాలు, నియోజకవర్గాల వారిగా పర్యటనలు చేస్తున్నారు.ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు.
రాజకీయ ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేస్తూ, జనాల్లో వారి ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ప్రతి విషయంలోనూ పారదర్శకత ప్రదర్శిస్తూ, పథకాల అమలు విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జనాల ఆదరణ వైసిపికి ఉండే విధంగా జగన్ ( CM jagan )ప్లాన్ చేసుకుంటున్నారు.అయితే ఇదంతా రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే.
వాస్తవంగా జగన్ ( CM jagan )ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని, దానిలో భాగంగానే ఇంతగా హడావుడి పడుతున్నారని, ప్రతిపక్షాలు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నాయి.ఏపీలో ముందస్తు జరుగుతాయని పదే పదే చెబుతున్నాయి.దీనిపై వైసీపీ సైతం స్పందించింది.ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని పదేపదే వైసిపి ప్రకటిస్తోంది.2019 ఎన్నికలకు మార్చి 10 న షెడ్యూల్ విడుదలైంది.ఇప్పుడు 2024 మార్చి 10వ తేదీన ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
దీనికి అనుగుణంగానే వైసీపీ సిద్ధం అవుతోంది.
రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రకటించడంతోపాటు, ఏపీ లో ఏ విషయాల్లో ప్రజల్లో అసంతృప్తి ఉందో గుర్తించి, వాటిని పరిష్కరించే దిశగా వైసిపి( YCP ) ప్రభుత్వం ముందుకు వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటోంది.ఇక ప్రస్తుతం టిడిపి, జనసేనలు బలహీనంగానే ఉన్నాయని , స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) కావడం, బెయిల్ పై బయటకు వచ్చినా రాజకీయ పర్యటనలు చేపట్టేందుకు కోర్టు అనుమతించకపోవడంతో ఇవన్నీ తమకు కలిసి వస్తాయని వైసిపి లెక్కలు వేసుకుంటోంది.వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది.