ఈటెల రాజేందర్ కు ఆ పదవి ఫిక్స్ కాబోతోందా ? 

తెలంగాణలో బిజెపి(Telangana BJP) వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది .

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బిజెపిని (BJP)బలమైన శక్తిగా మార్చి అధికారంలోకి రావాలనేప ట్టుదలతో ఉంది .

దీనికి అనుగుణంగానే అనేక వ్యూహాలను రచిస్తోంది.ఇప్పటికే బీఆర్ఎస్ (BRS)బాగా బలహీనం కావడం , కాంగ్రెస్(Congress) ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో , బిజెపికి ప్రజల నుంచి మరింత ఆదరణ దక్కుతుందని అంచనా వేస్తోంది.

ప్రజల మద్దతు కూడగట్టుకునే విధంగా క్షేత్రస్థాయిలోకి మరింతగా బిజెపి దూసుకు వెళ్లే విధంగా ఆ పార్టీ అధిష్టానం అనేక వ్యూహాలను రచిస్తోంది.

Is The Post Going To Be Fixed For Etela Rajender , Brs -bjp, Congress, Kishan Re

బీసీ నినాదంతో గత ఎన్నికల్లో గట్టిగానే ప్రచారం చేసిన బిజెపి కేవలం ఎనిమిది అసెంబ్లీ స్థానాలను దగ్గించుకుంది .అయితే ఈసారి అధికారం తమదే అన్న ధీమాతో ఉంది.దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో,  తెలంగాణ పైన మరింతగా దృష్టి సారించింది.

Advertisement
Is The Post Going To Be Fixed For Etela Rajender , BRS -BJP, Congress, Kishan Re

  ఏపీలో టిడిపి కూటమి(TDP Kutami) భాగస్వామ్యంగా ఉండడం,  అక్కర అధికారంలో ఉండడంతో , తెలంగాణ పై ఎక్కువ ఫోకస్ చేస్తోంది.జమిలి ఎన్నికలు (Jamili elections)వస్తే బిజెపి అధికారంలోకి వచ్చే విధంగా అనేక ఎత్తుగడలను రచిస్తోంది.

దీనిలో భాగంగానే తెలంగాణ బిజెపికి కొత్త అధ్యక్షుడిని నియమించాలని చూస్తోంది.ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి (Kishan Reddy)కేంద్రమంత్రిగాను బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండడంతో,  ఆయన పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల పై దృష్టి పెట్టకపోవడం తో ఆ పదవిని బిసి నేతకు కట్టబెట్టాలని బిజెపి అధిష్టానం భావిస్తోందట. 

Is The Post Going To Be Fixed For Etela Rajender , Brs -bjp, Congress, Kishan Re

ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి(Kishan Reddy) కూడా బిజెపి అధిష్టానం పెద్దలకు చెప్పడంతో,  వారు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రాజేందర్ (Rajender)ను తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా నియమిస్తే మంచిదనే ఆలోచనతో రాజేందర్ కు తెలంగాణలో సీనియర్ నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉండడంతో,  ఆయన అనుభవం తనకు కలిసి వస్తుందని బిజెపి పెద్దలు అంచనా వేస్తున్నారట.  తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి ఆర్థిక మంత్రిగాను రాజేందర్ పనిచేసిన అనుభవం ఉండడం , క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసిన నాయకుడు కావడంతో ఆయనకే బిజెపి తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని బిజెపి అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.బి ఆర్ ఎస్(BRS) ను మరింతగా బలహీనం చేసి బిజెపి ని బలోపేతం చేసే విధంగా రాజేందర్ వ్యూహాలు రచించగలరని, ఆయనకి ఆ బాధ్యతలు అప్పగించే ఆలోచనతో బిజెపి అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

  దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే బిజెపి అధిష్టానం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలంగాణ బిజెపి నాయకుల మధ్య చర్చ జరుగుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు