డిక్లరేషన్ సరే సీమలో లోకేష్ ప్రభావం ఎంతో ? 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( TDP National General Secretary Nara Lokesh ) యువకులు పాదయాత్ర ద్వారా జనాలకు పార్టీ శ్రేణులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.పార్టీలో చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో ప్రభావం చూపించగల నాయకుడిగా తనను తాను ప్రజెంట్ చేసుకుంటున్నారు.

 Lokesh Influence In Seema Details, Rayalaseema, Rayalaseema Declaration, Tdp, Te-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపు దగ్గర నుంచి ఎన్నికల మేనిఫెస్టో తో సహా కీలక నిర్ణయాలు అన్ని తన సారధ్యంలోనే జరిగే విధంగా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు.దీనికి అనుగుణంగానే టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu is the leader of TDP ) సైతం లోకేష్ ద్వారానే కీలక అంశాలను, పార్టీ విధి విధానాలను ప్రకటిస్తున్నారు.

లోకేష్ యువ గళం పాదయాత్ర( Lokesh Yuva Galam Padayatra ) రాయలసీమ జిల్లాలోని కొనసాగుతోంది.ఇప్పటికే మూడు జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర ముగిసింది.

కడప జిల్లా పాదయాత్రలోనే రాయలసీమ డిక్లరేషన్ లోకేష్ ప్రకటించారు.రాయలసీమ డిక్లరేషన్ లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని,  అలా నెరవేర్చకపోతే నాలుగేళ్ల తర్వాత ఇదే గడ్డపై తనను నిలదీయాలి అంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Ap Cm Jagan, Chandrababu Tdp, Rayalaseema, Jagan, Lokeshyuva, Manifesto,

హార్టికల్చర్ హబ్, సీడ్ హబ్, ఇండస్ట్రియల్ హబ్ ,స్పోర్ట్స్ క్యాపిటల్ , టూరిజం ఇరిగేషన్ ప్రాజెక్టులు,  నాలుగేళ్లలో మిషన్ రాయలసీమ హామీలు పూర్తి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.అదేవిధంగా పాడి రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ రైతులకు అందిస్తామని,  వ్యవసాయానికి వినియోగించే యంత్రాలు,  పరికరాలు ఏపీలో తయారుచేసి తక్కువ ధరకే సబ్సిడీపై రైతులకు అందిస్తామని ప్రకటించారు.యువతకు ఉపాధి కల్పించడం వంటి అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు.ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ప్రత్యేకించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఇక రాయలసీమకు సంబంధించి అనేక కీలక అంశాలను లోకేష్ ప్రకటించారు.వైసిపికి కంచుకోటగా ఉన్న రాయలసీమ లో టిడిపి ప్రభావం ఎంత ఉంటుంది ?  అలాగే లోకేష్ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ పై జనాల్లో సానుకూలత ఎంతవరకు ఉంటుందనేది చర్చనీయాంసంగా మారింది.ఇదేవిధంగా 2014 ఎన్నికల సమయంలో రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ఎన్నో హామీలను టిడిపి ప్రకటించింది.

Telugu Ap Cm Jagan, Chandrababu Tdp, Rayalaseema, Jagan, Lokeshyuva, Manifesto,

కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత , రాయలసీమ అభివృద్ధి పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు.ఫలితంగా 2019 ఎన్నికల్లో రాయలసీమలో ఒక్క స్థానం మినహా మిగతా అన్ని చోట్ల ఓటమి చెందడం తో టీడీపీ పూర్తిగా ఇక్కడ తుడిచిపెట్టి పోయిందనే విధంగా పరిస్థితి తయారయింది.అయితే ఈ మధ్యకాలంలో  పార్టీ కాస్త పుంజుకోవడం,  టిడిపి నిర్వహించిన సభలకు జనాలు హాజరు అవుతుండడం వంటివి కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.

అయితే ఇప్పుడు లోకేష్ ప్రకటించిన డిక్లరేషన్ ప్రభావం అంతంత మాత్రంగా ఉంటుందనే అభిప్రాయాలు సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube