టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్( Young hero Nikhil Siddharth ) గురించి అందరికీ తెలిసిందే.నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతడు అతి తక్కువ సమయంలో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
ఈ మధ్య మాత్రం వరుస అవకాశాలతో బాగా పరుగులు తీస్తున్నాడు.ఇక ఈ మధ్య మంచి సక్సెస్ లతో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు.
తొలిసారిగా సంబరం సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు నిఖిల్.ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాలో నటించి తన నటనకు మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
అలా పలు సినిమాలలో అవకాశాలు అందుకొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.ముఖ్యంగా స్వామిరారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ప్రస్తుతం స్టార్ హోదా వైపు అడుగులు వేస్తున్నాడు.
ఇక ఆ మధ్య విడుదలైన కార్తికేయ 2( Karthikeya 2 ) తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.ఇక 18 పేజెస్ సినిమాతో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది.
ఇక ప్రస్తుతం మరిన్ని ప్రాజెక్టులలో కూడా బిజీగా ఉన్నాడు.అయితే ఇదంతా పక్కన పెడితే.
ఈ సినిమాలతో నిఖిల్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.కేవలం తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషలోకి చెందిన ప్రజలను కూడా అభిమానులుగా మార్చుకున్నాడు.

ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు.తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటాడు.ఇంత పక్కన పెడితే ప్రస్తుతం నిఖిల్ తన సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లో ఉండేలా చూసుకుంటున్నాడని తెలిసింది.పైగా దర్శక నిర్మాతలు( Director Producers ) కూడా ఈయనతో సినిమాలు చేయడానికి ఎందుకు వస్తున్నారు.

మామూలుగా ఒకప్పుడు ఈయన తో సినిమాలు చేయాలి అంటే ఏ డైరెక్టర్ కూడా ముందుకు రాలేకపోయేది.అంతేకాకుండా ఐరన్ లెగ్ అంటూ అతడికి అవకాశాలు కూడా ఇచ్చే వాళ్ళు కాదు.ఇప్పుడు మాత్రం ఆయనతో సినిమాలు చేయటానికి పోటీ పడుతున్నారు దర్శకులు.ఇక రామ్ చరణ్ లాంటి వాళ్ళు కూడా ఈయనతో సినిమాలు చేయటానికి కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో కోట్లు పోసి మరి సినిమా తీస్తున్నారట.అయితే నిఖిల్ కి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఆయన నటించిన కార్తికేయ 2 సినిమా అని చెప్పాలి.ఎందుకంటే ఈ సినిమా ఎంతలా టాక్ సొంతం చేసుకుందో చూసాం.ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత నిఖిల్ లెవెల్ మొత్తం మారిపోయింది.దీంతో నిఖిల్ అభిమానులు.ఒకప్పుడు నిఖిల్ ను వద్దనుకున్న వాళ్లే ఇప్పుడు ఆయన వెంట పడటంతో.
ఒక్క సక్సెస్ రాగానే బాగానే వెంటపడుతున్నారు కదా అంటూ.అదే సక్సెస్ లేకపోతే సైలెంట్ గా ఉండే వాళ్లేమో కదా అని అంటున్నారు.
