Anupama : అనుపమతో స్టార్ హీరోస్ నటించకపోవడానికి కారణం అదేనా.. అందుకే అమ్మడికి దూరంగా ఉంటారా?

టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) టాలీవుడ్ కుర్రాళ్లకు క్రష్ అని చెప్పాలి.అందంతో, నటనతో అందరిని ఇట్టే పడేసింది.

 Is That The Reason Why Star Heroes Are Not Acting With Anupama-TeluguStop.com

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ( Tamil, Malayalam ) సినిమాలలో కూడా నటించింది.తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది అనుపమ.

ఆ తర్వాత ‘అఆ’ సినిమాతో నాగవల్లి పాత్రలో బాగా ఆకట్టుకుంది.

Telugu Anupama, Compromise, Kollywood, Tollywood-Movie

ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో.అలా ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అతి తక్కువ సమయంలో ఒక హోదా సొంతం చేసుకుంది అనుపమ.

రీసెంట్ గా వరుస సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుంది.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.

నిత్యం ఏదో ఒక ఫోటోను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తుంది.ఇక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.

అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.

Telugu Anupama, Compromise, Kollywood, Tollywood-Movie

అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో ఎక్కువగా నటించినట్లు కనిపించలేదు.ఇక దానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది.అదేంటంటే తనకు తల పొగరు అని.అనుపమకు అంత తలపోగరా.అంటే అవునని అంటున్నారు కొందరు.ఈమె ఈగోని హార్ట్ చేస్తే అంతే సంగతని అంటున్నారు.అలా ఆమెకు సంబంధించిన ఒక వార్త కూడా బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే.

టాలీవుడ్ స్టార్ హీరోలు ఈమెకు అవకాశం ఇవ్వకపోవడానికి కారణం ఆమెకు ఉన్న పొగరే అని అంటున్నారు.అంతేకాదు అనుపమ పరమేశ్వరన్ డైరెక్టర్స్ చెప్పిన వాటికి కాంప్రమైజ్ అవ్వదని.

తనకి ఇష్టం లేకపోతే నేరుగా అది నాకు ఇష్టం లేదు అంటూ చెప్పేస్తుందట.

Telugu Anupama, Compromise, Kollywood, Tollywood-Movie

ఇక పక్కన ఎంత పెద్ద స్టార్ హీరో( Star hero ) ఉన్న పట్టించుకోదు అని.అలాంటి హీరోయిన్ తో నటించడానికి టాలీవుడ్ హీరోలు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.అంతేకాదు పలు బడా ప్రాజెక్టు సినిమాలలో హీరోయిన్ గా అనుపమని అనుకొని కొందరు డైరెక్టర్లు, హీరోలు వద్దని చెప్పడంతో రిజెక్ట్ చేశారట.

అందుకే అనుపమతో స్టార్ హీరోలు నటించరని తెలుస్తుంది.దీంతో ఈమె అభిమానులు ఆమె అంటువంటి అమ్మాయి కాదు.కొందరు కావాలనే ఆమెపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు.మరి కొంత మంది మాత్రం ఆమె స్టార్ హీరోలతో నటించక పోయే సరికి ఇదే కారణం ఏమో అని అనుకుంటున్నారు.

ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే అనుపమ ఈ విషయం గురించి స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube