తెలుగులో ఒక “వి” చిత్రం అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమైన ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఆది పినిశెట్టి తెలుగులో వైశాలి, సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం, నీవెవరో, తదితర చిత్రాలతో సినీ ప్రేక్షకులని బాగానే అలరించాడు.
అయితే ఆది పినిశెట్టి సినీ బ్యా గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి సినిమా పరిశ్రమకు వచ్చినప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకుని సొంతంగా సినిమా అవకాశాలను దక్కించుకున్నాడు.ఇందులో భాగంగా పలు అవార్డులను కూడా దక్కించుకున్నాడు.
అయితే ఆది పినిశెట్టి కేవలం హీరో పాత్రలలో మాత్రమే కాకుండా సరైనోడు, అజ్ఞాతవాసి తదితర చిత్రాలలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
కాగా తాజాగా హీరో ఆది పినిశెట్టికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వార్త ఏమిటంటే తాజాగా ఆది పినిశెట్టి తన సోదరుడు సత్య ప్రభాస్ పినిశెట్టి ని టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.అయితే సత్య ప్రభాస్ పినిశెట్టి గతంలో ఆది పినిశెట్టి హీరోగా నటించిన “మలుపు” అనే చిత్రానికి దర్శకత్వ విభాగంలో పని చేశాడు.
కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఆది పినిశెట్టి తన తమ్ముడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసే పనులను టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి కి అప్పజెప్పినట్లు సమాచారం.కాగా సత్య ప్రభాస్ పినిశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రానికి తన తండ్రి రవిరాజా పినిశెట్టి కథను అందిస్తున్నట్లు కూడా కొందరు చర్చించుకుంటున్నారు.కానీ ఇప్పటివరకు ఆది పినిశెట్టి తన తమ్ముడిని హీరోగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తున్నట్లు వినిపిస్తున్న కథనాలపై మాత్రం స్పందించలేదు.
దీంతో ఈ వార్తల్లో నిజమెంతుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఆది పినిశెట్టి తెలుగు, తమిళ, పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు.
కాగా ఆది పినిశెట్టి ప్రస్తుతం దాదాపుగా మూడు చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు.ఇందులో తెలుగులో “గుడ్ లక్ సఖి” అనే చిత్రంలో హిరో గా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో మహానటి చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉన్నట్లు సమాచారం.