తమిళ ఫిల్మ్‌ మేకర్స్ 'బాహుబలి'ని రీ క్రియేట్‌ చేయగల సమర్ధులా?

ఎప్పటి నుండో తెలుగు సినిమాలని బీట్ చేయాలని, ఇండియన్ సినీ మార్కెట్ లో తెలుగు సినిమాలను( Telugu movies ) మించి ఉండాలని తమిళ ఫిలిం మేకర్స్( Tamil film makers ) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.మాయాబజార్ మొదలుకొని ఎన్నో సినిమాలను అద్భుతంగా తెలుగు ప్రేక్షకులకు అందించిన టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ముందు తమిళ ఫిలిం మేకర్స్ ఫెయిలవుతూనే వస్తున్నారు.

 Is Tamil Film Makers Able To Baahubali Like Movie Details, Baahubali, Shiva, Sur-TeluguStop.com

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి బాహుబలి వంటి అద్భుతాన్ని ఆవిష్కరించారు.ఆ స్థాయి సినిమా కోసం తమిళ సినిమా ఇండస్ట్రీ ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఇప్పుడు సూర్య హీరోగా శివ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ను బాహుబలి రేంజ్ సినిమా అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

ఆ స్థాయిలో శివ దర్శకత్వం లో సూర్య హీరో గా సినిమా వస్తుంది అంటే ఏ ఒక్కరు నమ్మే పరిస్థితి లేదు.కానీ మేకర్స్ మాత్రం ప్రముఖంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.సూర్య ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చిత్రాన్ని సభ్యులు చెప్తున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ని రివిల్ చేయడం జరిగింది.ఒక అద్భుతమైన పౌరాణిక కథ నేపథ్యం లో ఈ సినిమా రూపొందించడం జరిగింది.

ప్రతిఒక్క సినీ ప్రేమికుడిని అలరించే విధంగా, చరిత్ర గురించి తెలియని వారికి కూడా ఈ సినిమా అర్ధమయ్యే విధంగా ఉంటుందని మేకర్ చెప్తున్నారు.ఈ సినిమా ను తెలుగు నిర్మాణ సంస్థ యు వీ క్రియేషన్స్ వారు తమిళనాడు సంస్థ స్టూడియో గ్రీన్ తో కలిసి నిర్మిస్తున్న విషయం తెల్సిందే.సూర్య కెరియర్లో అత్యధిక బడ్జెట్ సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని ప్రతి ఒక్కరు చాలా ధీమా తో ఉన్నారు అలాగే వసూళ్ల విషయం లో కూడా ఈ సినిమా బాహుబలి రేంజ్ లో ఉంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి తమిళ ఫిలిం మేకర్స్ బాహుబలి స్థాయి వసూళ్లు సాధించగలరా అనేది సినిమాతో మరోసారి నిరూపితం కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube