స్వామివారి ధర్మాగ్రహం వెనుక కారణాలు ఇవేనా?

ఆంధ్రప్రదేశ్లోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రమైన సింహాచలం నరసింహస్వామి( Simhachalam Narasimhaswamy ) వారి చందనోత్సవ ఉత్సవాలలో సరైన ఏర్పాట్లు జరగలేదని, భగవంతుడి నుంచి భక్తులను దూరం చేస్తున్నారంటూ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద స్వామి ( Sri Swarupananda Swami ) ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది ఇంత దారుణంగా నిర్వహణ చేయడం ఇదే మొదటి సారి అని ఇక్కడికి వచ్చినందుకు మొదటి సారి బాధపడుతున్నాను అంటూ ఆయన వాఖ్యనిచడం గమనార్హం తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఇద్దరికీ సాన్నిహిత్యం గా ఉంటారు అన్న పేరున్న ఈ స్వామీజీ ఒక్కసారిగా ప్రభుత్వ అధికార యంత్రాంగం మీద విమర్శలు చేయడంతో తెర వెనుక ఏం జరిగి ఉంటుందా అన్నఊహాగానాలు మొదలయ్యాయి ముఖ్యంగా జగన్ మీద విపరీతమైన అభిమానం చూపించే ఈయన ప్రభుత్వానికి అనుకూలంగా అనేకసార్లు వ్యాఖ్యలు చేశారు.

 Is Swami Serious On Administration Only , Simhachalam Narasimhaswamy , Chandanot-TeluguStop.com
Telugu Cm Jagan, Sriswarupananda-Telugu Political News

జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను అని కూడా ఇంతకు ముందు పబ్లిక్ గా ఆయన ప్రకటించారు .మరిప్పుడు ఒక్కసారిగా ఇలా ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడటంతో వైసీపీ( YCP ) అధినాయకత్వం తో ఆయనకు ఏమన్నా చెడిందా అంటూ కొంతమంది అంచనాలు వేస్తున్నారుఅయితే ఆయన వ్యాఖ్యలను పూర్తిగా వినాలని… జగన్ మంచివాడని, పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాడని అయితే ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయకుండా ఆయనకు చెడ్డ పేరు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు తప్ప ప్రభుత్వాన్ని విమర్శించలేదని కొంతమంది వైసిపి నాయకులు చెబుతున్నమాట .

Telugu Cm Jagan, Sriswarupananda-Telugu Political News

వివరాలలోకి వెళ్తే సంవత్సరానికి ఒకసారి జరిగే చందనోత్సవ వేడుకల్లో లక్షల మంది ప్రజలు స్వామివారి నిజరూప దర్శనం కోసం తరలి వస్తారని ప్రతి సంవత్సరం జరిగే వేడుకకు పూర్తి స్థాయి ఈవో లేకపోవడం అదికారుల మద్య సమన్వయం లేకపోవడం తో ప్రణాళికా లోపంతో సరైన ఏర్పాట్లు చేయలేదని దాంతో చిన్నపిల్లలు వృద్ధులు, ఎండలో గంటల తరబడి నిలబడటంతో అసౌకర్యానికి గురయ్యారని, అనారోగ్యానికి గురిఅయ్యారని ఇది దగ్గరుండి చూసిన స్వామీజీకి కోపం అలా మాట్లాడారు తప్ప జగన్ గురించి తప్పుగా మాట్లాడలేదని వైసిపి వర్గాలు అంటున్నాయిఈ వేడుకలను ప్రతి సంవత్సరం ఆయన సూచనలతోనే జరిపిస్తారని ఈసారి తనని పక్కన పెట్టడం పట్ల కినుకు వహించి ఆయన అలా మాట్లాడారంటూ మరి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube