రేపటితో తెలుగు సినిమా గమనం తెలిసిపోతుంది

ఒక్కో సమయంలో ఒక్కో సినిమాలు ట్రెండ్ అవుతాయి.15 సంవత్సరాలు వెనక్కి వెళితే, సినిమా అంటే బోలెడంత యాక్షన్ ఉండాలి, పగలు ప్రతీకారాలు, నరుక్కోవడాలు, పెద్ద పెద్ద డైలాగులు, హీరోకి ఓ రేంజ్ ఫ్లాష్ బ్యాక్.

ఇవే ఎలిమెంట్స్ తో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, సింహాద్రి తదితర సినిమాలు మాస్ జనాలకి నాటు భోజనం పెట్టి కనువిందు చేసాయి.

బాక్సాఫీస్ ను రఫ్ ఆడించాయి.ఆ కాలంలో పవన్ ఖుషి, మహేష్ ఒక్కడు లాంటివి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి.పూర్తీ యుత్ ఫుల్ సినిమాతో పవన్ కుర్రకారుకి కిక్కేకిస్తే, అసలు ఎలాంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు, భారి భారి డైలాగులు లేకుండా, మాస్ అంటే అరవడం, తొడలు కొట్టడం మాత్రమె కాదు అని మహేష్ నిరూపించాడు.

ఆ తరువాత నరుక్కునే సినిమాల హవా తగ్గిపోయింది.అప్పటివరకు వరుస హిట్లు కొట్టిన ఎన్టీఆర్ కి ఫ్లాపులు వచ్చాయి.దానికి కారణం జనాలు మారడం.2006 లో వచ్చింది పోకిరి.బుల్లెట్లలా దూసుకొచ్చే డైలాగులు, ఆవారాగా తిరిగే హీరో, మాఫియా, గన్స్ .ఇలా కొత్తరకం సినిమాగా వచ్చింది పోకిరి.అప్పటివరకు ఉన్న రికార్డులు అన్నిటిని తిరగరాసింది.

అంతే, అంతా మాఫియ ని పట్టుకున్నారు.హీరోలంతా గాలికి తిరిగారు.

Advertisement

తిక్కతిక్కగా మాట్లాడడం మొదలుపెట్టారు.కొన్ని హిట్ అన్నాయి, కొన్ని ఫట్ అన్నాయి.

పూరి తన సొంత ఫార్ములాతో ఫ్లాప్స్ లో పడిపోవడంతో ఆ రకమైన సినిమాలు ఆగిపోయాయి.ఇక శ్రీనువైట్ల - కోన వెంకట్ బకరా కామెడి అనే ట్రెండ్ ని ప్రవేశపెట్టారు.

ఈ సంవత్సరం కుడా ఈ పద్ధతిని పాటించి బ్రూస్ లీ, అఖిల్ లాంటి చిత్రాలు బొక్కబోర్లా పడ్డాయి.కోనవెంకట్ సినిమా అంటే చాలు నెగెటివ్ గా ఆలోచిస్తున్నారు ప్రేక్షకులు.

ఇకా ఈ ఏడాది హిట్స్ గా నిలిచినా చిత్రాల్లో బాహుబలి మునుపెన్నాడు లేని సినిమా అయితే, శ్రీమంతుడు అదోరకం ట్రెండ్ సెట్టర్.అందులో మహేష్ నుంచి ఆశించే పంచ్ డైలాగులు కాని, కామెడి కాని ఉండదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?

కేవలం కథను నమ్ముకొని లాభాల బాట పెట్టించాడు కొరటాల శివ.మూసలో వచ్చిన బెంగాల్ టైగర్ ఓపెనింగ్స్ రాబట్టుకున్నా, చివరకి నష్టాలు తీసుకొస్తోంది.ఇక రేపు విడుదల అవబోతున్న సౌఖ్యం మరో మూస సినిమా.

Advertisement

రేపటితో మన ప్రేక్షకులు నిజంగానే మారారా లేదా అనేది తెలిసిపోతుంది.ఇంకా కమర్షియల్ సినిమాలు చూస్తారా లేదా కొత్తదనం కోరుకుంటున్నారా రేపటితో తేలిపోతుంది.

తాజా వార్తలు