తెలుగు చిత్ర పరిశ్రమలో శృంగార తారగా ఎన్నో చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి షకీలా( Shakeela ) ఒకానొక సమయంలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండేవారు.ఎక్కువగా వ్యాంప్ పాత్రలలో నటించినటువంటి ఈమెకు భారీగా డిమాండ్ ఉండడంతో అప్పట్లో ప్రతి ఒక్క సినిమాలో కూడా ఈమెకు అవకాశాలు కల్పించారు.
ఇక ఈమె సినిమాలలో నటిస్తుందనే విషయం తెలిస్తే కనుక జనాలు పెద్ద ఎత్తున ఆ సినిమాకు బ్రహ్మ రథం పట్టేవారు.అంతలా ఈమె ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది.
ఈ విధంగా శృంగార తారగా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించినటువంటి ఈమె సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బుని మొత్తం తన సొంత అక్క చేతిలో పెట్టి దారుణంగా మోసపోయిన సంగతి మనకు తెలిసిందే.అయితే నిజ జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడపడమే కాకుండా ఈమె ఎంతో మంది ట్రాన్స్ జెండర్ లను చేరదీసి వారందరికీ అమ్మగా మారిపోయారు.
ఒకప్పుడు సంపాదించినది మొత్తం పోగొట్టుకోవడం మరొకవైపు అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం షకీలా పరిస్థితి కాస్త ఇబ్బందులలోనే ఉందని చెప్పాలి.

ఇక ప్రస్తుతం షకీలాకు సినిమా అవకాశాలు కూడా లేకపోవడంతో ఈమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.ఇప్పటికే పలు కన్నడ బుల్లితెర రియాలిటీ షో లతో పాటు తెలుగులో కూడా బిగ్ బాస్ ( Bigg Boss ) అవకాశాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక షకీలా బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొని రెండు వారాలపాటు హౌస్ లో సందడి చేశారు.
ఇక రెండవ వారం ఈమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.ఇక హౌస్ లో ఉన్నన్ని రోజులు ఈమె ఒక పెద్ద దానిలాగా అందరికీ సలహాలు సూచనలు చేస్తూ వచ్చారు అయితే హౌస్ లో షకీలా భారీ స్థాయిలో సిగరెట్లు ( Ciggaret ) కాల్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ వయసులో ఇలా సిగరెట్లు తాగటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అంటూ ఈమె ఈ చెడు అలవాట్లపై పలువురు కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈమె ఈ అలవాట్లకు ఎలా బానిస అయ్యారనే విషయం గురించి ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది.ఒక స్టార్ హీరోయిన్( Star heroine ) కారణంగానే షకీలా సిగరెట్లు తాగడానికి అలవాటు పడ్డారని తెలుస్తోంది.మరి షకీలా ఇలాంటి చెడు అలవాట్లకు బానిస కావడానికి కారణం అయినా ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే… బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి పూజ భట్( Pooja Bhatt ) కారణంగానే తాను కూడా సిగరెట్ లకు అలవాటు పడ్డారని ఈమె ఒక సందర్భంలో తెలియజేశారు.
ఆమె చాలా స్టైలిష్ గా సిగరెట్లు కాల్చేది తనని చూసి నేను కూడా అలాగే కాల్చాలని సిగరెట్ తాగడం అలవాటు చేసుకున్నాను అయితే అదే వ్యసనంగా మారిపోయింది అంటూ ఒక సందర్భంలో షకీలా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







