భారత్, కెనడా మధ్య ఖలిస్థానీ చిచ్చు మరింత ముదిరింది.ఈ క్రమంలో కెనడా హై కమీషనర్ కెమరాన్ మెక్కేకు భారత్ సమన్లు జారీ చేసింది.
కెనడా హై కమిషనర్ ను విదేశీ వ్యవహారాల కార్యలాయానికి పిలిపించిన భారత్ సమన్లు జారీ చేసింది.ఈ నేపథ్యంలో భారత దౌత్య వేత్తను బహిష్కరించినట్లు కెనడా ప్రకటించగానే భారత ప్రభుత్వం చర్యలకు దిగింది.
ఖలిస్థానీ మద్దతుదారుడు హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించారు.ఈ హత్య తమ సార్వభౌమాత్వానికి భంగం కలిగించే విధంగా ఉందని ఆరోపణలు చేశారు.
ఢిల్లీ వేదికగా జరిగిన జీ 20 సమ్మిట్ లో ప్రధాని మోదీ దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు.అయితే కెనడా ఆరోపణలను ఖండించిన భారత్ ఉద్దేశ పూర్వకంగా ఈ విధంగా మాడ్లాడుతుందని మండిపడింది.
అయితే ఈ ఏడాది జూన్ లో హర్ దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు.బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలోని గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపిన విషయం తెలిసిందే.
నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ అయిన హర్ దీప్ భారత్ లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులో జాబితాలో ఒకడిగా ఉన్నాడు.ఈ క్రమంలోనే కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసిన కెనడా భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేసింది.







