పొంగులేటి తో రేవంత్ రెడ్డికి డేంజర్ బెల్స్ ?

Is Revanth Reddy In Danger With Ponguleti Srinivas Reddy, Revanth Reddy, Ponguleti Srinivasa Reddy , Sonia Gandhi , Brs Party , Cm Kcr , Congress , Rahul Gandhi, Ts Politics

టి కాంగ్రెస్ లో పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy )కి డేంజర్ బెల్స్ మొగుతున్నాయా ? పార్టీ అధ్యక్ష పదవిలో ఆయనకు పొంగులేటితో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందా ? అంటే తాజాగా పరిణామాలు చూస్తుంటే అవునేమో అనే సమాధానం వస్తోంది.రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తరువాత పార్టీ సీనియర్ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది.

 Is Revanth Reddy In Danger With Ponguleti Srinivas Reddy, Revanth Reddy, Pongule-TeluguStop.com

సీనియర్ నేతలంతా మూకుమ్మడి గా రేవంత్ రెడ్డి నాయకత్వంపై తిరుగుబాటు చేశారు.ఆయనను అధ్యక్ష పదవినుంచి తొలగించాలని సీనియర్ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

Telugu Brs, Cm Kcr, Congress, Rahul Gandhi, Revanth Reddy, Sonia Gandhi, Telanga

అయితే రేవంత్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించే నాయకత్వ కొరత ఏర్పడుతుందని రేవంత్ విషయంలో ఎన్ని పిర్యాదులు వచ్చిన అధిష్టానం చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తూ వచ్చింది.అయితే ఇప్పుడు టి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి9 Ponguleti Srinivasa Reddy ) ద్వారా గట్టి పోటీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖమ్మం జిల్లాలో మంచి పట్టు ఉన్న నాయకుడిగా పేరుంది.అలాగే గతంలో బి‌ఆర్‌ఎస్ లో ఉన్నందున కే‌సి‌ఆర్ వ్యూహాలను అంచనా వేయడంలోనూ బి‌ఆర్‌ఎస్ లోని లొసుగులను తెరపైకి తీసుకురావడంలోను పొంగులేటి ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉంది.

Telugu Brs, Cm Kcr, Congress, Rahul Gandhi, Revanth Reddy, Sonia Gandhi, Telanga

అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా అందరి నేతలతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండడం పొంగులేటికి కలిసొచ్చే అంశం.ఈ కారణాల చేతనే పొంగులేటికి పార్టీలో అధిక ప్రదాన్యం ఇస్తోంది హస్తం హైకమాండ్.పార్టీలో చేరగానే.ప్రచార కమిటీ కొ చైర్మెన్ గా పొంగులేటికి కీలక బాధ్యతలు అప్పగించింది అధిష్టానం.దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పొంగులేటికి ఏ స్థాయిలో ప్రదాన్యత ఇస్తోందనే అంశాన్ని.ఇక రాబోయే రోజుల్లో టి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తరువాతి స్థానాన్ని పొంగులేటి కైవసం చేసుకునే అవక్షలు కనిపిస్తున్నాయి.

అసలే ఆధిపత్య విభేదాలు, వర్గ విభేదాలు కాంగ్రెస్ లో కొత్తేమీ కాదు.రేవంత్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నేతలందరు పొంగులేటికి మద్దతుగా నిలిస్తే రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవికి డేంజర్ బెల్స్ మోగే అవకాశం లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube