సినిమాను సినిమాగా చూడటం ఎప్పుడో మానేశారు జనాలు.నిత్యం చేతిలో ఉండే ఫోను అన్ని బాషల సినిమాలను చూపించడం, కొత్త రీమేక్ సినిమాలు వస్తే అది ఎంత బాగా తీశారు అనే విషయం మర్చిపోయి ఎంత బాగా సినిమాను దర్శకుడు చెడగొట్టాడు అని వెతుకులాట.
సీన్ టూ సీన్ రివ్యూ చేస్తున్న రోజులు.అందుకే ఒక్కోసారి సినిమా చచ్చిపోతుందా లేక ప్రేక్షకుడు చచ్చిపోతున్నాడా అనే అనుమానం వస్తుంది.
ఈ తరం యువత అయితే ప్రతి భాషలోని సినిమాను ఓటిటి లో చూసేస్తున్నారు కాబట్టి రీమేక్ సినిమాలు వస్తే చూడటం మానేశారు.ఎవరో కొంత మంచి సినిమా ప్రేమికులు లేదా హీరో ఫ్యాన్స్ మాత్రమే తమ అభిమాన హీరో ఏం తీసిన చూస్తున్నారు.
ఇక రీమేక్ సినిమా తీస్తుంటే కథ లో మార్పులు చేస్తే వరిజినల్ సినిమాతో పోల్చి చూసి అదే బాగుంది అంటారు.ఇక ఎలాంటి మార్పులు చేయకపోతే ఉన్నది ఉన్నట్టుగా మక్కిగా దించేశారు అంటారు.
ఇక ఇలా అయితే సినిమా పరిశ్రమ ఎలా ముందుకు వెళ్తుంది.గతంలో అయితే 2002లో ‘ఠాగూర్’, 2004లో ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’, 2014లో ‘గబ్బర్‌సింగ్’ వచ్చినప్పుడు అవి రీమేక్ కథలు లేదంటే వేరే భాషలో ఇదివరకే వచ్చాయి అని తెలియకపోవడం తో పిచ్చ పిచ్చగా సినిమా థియేటర్ లో ఎంజాయ్ చేసామో అప్పటి సందడి గుర్తుకువస్తే ఈ రోజుల్లో వస్తున్నవి సినిమాలైనా అని అనిపిస్తుంది.

చివరిగా చెప్పాచ్చేది ఏంటంటే సినిమా ను సినిమాగా కథను బాగా మెరుగుపరిచి తీయడానికి దర్శకుడు ప్రయత్నించాలి.స్క్రిప్ట్ బాగా డెవలప్ చేయాలి.కానీ పెద్ద హీరోల సినిమాల విషయానికి వస్తే అంత సాహసం అటు దర్శకుడు కానీ ఇటు రైటర్ కానీ చేయలేరు.అందుకే ఈ మధ్య వచ్చిన ఆచార్య లాంటి సినిమాలు పెద్దగా ఆడలేదు.
జనాలు కూడా ఈ రీమేక్ సినిమాలను చూడటానికి థియేటర్ కి వెళ్ళడానికి కూడా సిద్ధం గా లేరు.దాంతో సినిమా పరిశ్రమ లాస్ లోకి వెళ్తుంది.
చాల మంది టెక్నీషియన్స్ ఇండస్ట్రీ నుంచి విరమించుకుంటున్నారు.మరి ఈ పరంపర ఇలాగె కొనసాగితే రానున్న కాలం ఎటు దారి తీస్తుందో.







