బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.ఇక ఈ సినిమా తర్వాత ఈయన లైనప్ భారీగా పెరిగింది.
ప్రజెంట్ ఈయన నాలుగైదు ప్రాజెక్టులను ఒకేసారి చేస్తూ బిజీగా ఉన్నాడు.అయితే తాజాగా ప్రభాస్ లైనప్ లో ఒక కొత్త పేరు వినిపిస్తుంది.
ప్రభాస్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ఒక భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ మొదలయ్యాయి.
వీరి కాంబో ఎప్పుడు వినలేదు.
ఈ సరికొత్త కాంబో పై అందరు ఆసక్తి కనబరుస్తున్నారు.త్రివిక్రమ్ కూడా ఏ డైరెక్టర్ ఇంతవరకు ప్రభాస్( Prabhas ) తో చేయని కొత్త సబ్జెక్ట్ ను నేరేట్ చేసి డార్లింగ్ ( Darling )తో సినిమా చేయబోతున్నట్టు టాక్.
మరి ఈ కాంబో ఎప్పటికి వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఈ వార్త నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.
ప్రజెంట్ త్రివిక్రమ్ మహేష్ బాబుతో( Trivikram , Mahesh Babu ) అదిరిపోయే మాస్ సబ్జెక్ట్ ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.ఆ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి.మరి అప్పటికి డార్లింగ్ చేతిలో సినిమాలు కూడా ఫినిష్ అవుతాయి.
దీంతో ఈ కాంబో మరో ఏడాది తర్వాత సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Om Rauth ) దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ వచ్చే నెల జూన్ 16న రిలీజ్ కాబోతుంది.దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే చేస్తూనే మారుతి దర్శకత్వంలో మరో మీడియం బడ్జెట్ సినిమాను చేస్తున్నాడు.
మరి ఈ సినిమాల్లో ఫ్యాన్స్ ను ఖుషీ చేసే సినిమా ఏదో వేచి చూడాల్సిందే.