నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభ జన సైనికులతో పోటెత్తింది .
సహజంగా పొలిటికల్ పంచులతో సభను అధ్యంతం హోరెత్తించే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈసారి చాలా నిదానంగా మాట్లాడారు ఇతర పార్టీలపై విమర్శలు కంటే కూడా జనసైనికులకు క్లాస్ తీసుకోవడానికి, వారిని కొన్ని విషయాలలో సమాదన పరిచేందుకు పవన్ కళ్యాణ్ ఎక్కువ సమయం కేటాయించారు ఆయన మొత్తం స్పీచ్ లో సగభాగం కులాల మధ్య సయోద్య మీద ఒక ట్రైనింగ్ క్లాస్ లా గడిచింది అన్నా ఆశ్చర్యం లేదు .
కులాల మధ్య ఘర్షణలు ఉంటే సమాజం ముందుకెళ్లదు అన్న పవన్ కళ్యాణ్ ఎవరూ కూడా కావాలని ఒక కులం లో పుట్టరని, ఏ కులంలో పుట్టినా కూడా అన్ని కులాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
అగ్ర కులాలలో కూడా పేదలకు ఉన్నారని వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో కులం ఒక అడ్డంకిలాగా వెనుకకు లాగుతుంటుందని అలానే వెనుకబడిన వర్గాలకు ఉన్న రిజర్వేషన్లు కూడా సహేతుకమైననే వాటి వల్ల వాళ్ళ జీవితాలకు ఒక ఆసరా ఉంటుందని తెలిపారు.అగ్రకులాల్లో పుట్టిన పేదలకు తమ పార్టీ సపోర్టు ఉంటుందని తెలిపిన ఆయన అణగారిన వర్గాలకు మద్దతు విషయంలో తను ఎప్పటికీ వెనకడుగువేయనని కూడా బరోసా ఇచ్చారు.బీజేపీ( BJP )తో కలిసి వెళ్ళటం వల్ల మైనారిటీలు తనకు దూరమయ్యారు అన్న పవన్ కళ్యాణ్ మరి అదే బిజెపితో తెరచాటు మైత్రి నెరుపుతున్న వైసీపీ( YCP )కి మాత్రం ఎందుకు దగ్గరవుతున్నారు అంటూ ప్రశ్నించారు.
తాను ఏం చేసినా అదికారికంగా చేస్తానంటూ ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.కమ్మ కాపు కులాలు మధ్యన సయోధ్య ఉండాలంటూ ఆయన హితవు పలికారు .ఈ మధ్యన జరిగిన కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది.కొన్ని పార్టీలు కావాలనే ఈ రెండు కులాల మధ్యన గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని యువత వారి ట్రాప్ లో పడకూడదని ఆయన సూచన చేశారు.
కాపులకు ఆరాధ్య దైవం వంటి వంగవీటి రంగా( Vangaveeti Ranga ) గారు కూడా కమ్మ ఇంటి ఆడపడుచును పెళ్లి చేసుకున్నారని వంగవీటి రాధా కమ్మ మరియు కాపుల బిడ్డని, నా చుట్టూ ఉన్న చాలా మంది కూడా ఇతర కులాల వ్యక్తులను పెళ్లి చేసుకున్నారని ఆయన తెలిపారు ఏదో ఒక కులాన్ని అందరం ఎక్కించే వ్యక్తిని నేను కాదని ముందు అందరూ మనుషులుగా ముందుకు వెళదామని ఆయన పిలుపునిచ్చారు.ఏది ఏమైనా ముందు ముందు ఈ రెండు పార్టీల మధ్య కుదరపోయేపొత్తుని అడ్డుకోవడానికి కులాల మధ్య గొడవలు పెట్టే అవకాశం అధికార పార్టీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపద్యం లో దీనిని ముందుగా ఎదురుకోవడానికి జన సైనికులను మానసికంగా ప్రిపేర్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి .సహజంగా ఆవేశంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈసారి జనసైనికులను సమాధానపరిచే విధంగా మాట్లాడటం చూస్తే ఆయన పూర్తి రాజకీయ నాయకుడిగా మారుతున్నారని చెప్పాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy