పవన్ కన్ఫ్యూజ్ అవుతున్నారా? చేస్తున్నారా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయం సాదారణ ప్రజలకు అర్థం కావట్లేదు అంటే ఏమో గాని ఆయన హార్డ్ కోర్ అభిమానుల తో పాటు మొదటి నుండి ఆయనని అనుసరిస్తున్న కార్యకర్తలకు కూడా అర్దం కావడం లేదని వార్తలు వస్తున్నాయి ఎవరికి అర్దం కానీ ఒక కొత్త అయోమయ పరిస్థితిని సృష్టించడంలో మాత్రం ఆయన విజయవంతమయ్యారనే చెప్పాలి.

ముఖ్యంగా గత కొన్నాళ్లుగా పార్టీ కొనసాగుతున్న విధానం ఆ పార్టీ కార్యకర్తలతో పాటు ఆ పార్టీని కి బయట నుండి మద్దతు ఇస్తున్న వారికి కూడా అసంతృప్తి కలిగిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం అవసరం లేదు.

ముఖ్యంగా గత కొన్నాళ్లుగా ప్రో-టీడిపి విధానాలతో( pro-TDP policies ) వెళ్తున్న జనసేనాని సొంత పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తుంది కనిపిస్తూనే ఉంది.

పార్టీకి మొదటి నుంచి ప్రాణం పెట్టి పనిచేసిన వారికి పార్టీ స్వరాన్ని వివిధ సామాజిక వేదికలపై బలం గా వినిపిస్తున్న వారికి కూడా పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర నిరోత్సాహానికి గురిచేసాయని తెలుస్తుంది.గత కొన్నేలుగా వైసిపి( YCP ) వ్యతిరేక స్వరాన్ని బలంగా విడిపించిన కొన్ని జనసేన గొంతులు గత కొన్ని రోజులుగా వినిపించక పోవడమే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.అంతేగా కాకుండా వైసిపిలో అభ్యర్థుల మార్పు తాలూకు సంచలనాలతో జనసేన హడావుడి నిజానికి కాస్త పెరగాలి.

కానీ ప్రస్తుతం జనసేనలో ఒక రకమైన నిర్లిప్తత కనిపిస్తుంది.దానికి తోడు పవన్ విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న ద్వంద వైఖరి కూడా జనసేన కేడర్ కు కొత్త అనుమానాలను కలిగిస్తుంది.

Advertisement

చంద్రబాబు( Chandrababu ) స్థాయిలో పవన్తో సయోధ్య బాగానే ఉన్నప్పటికీ తెలుగుదేశంలో ద్వితీశ్రేణి నాయకులతో, లోకేష్ లోకేష్ అనుచరుల తో పవన్ కు కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతూ ఉండటం గమనార్హం .

అందుకే లోకేష్ యువగళం( Lokesh Yuvagalam ) ముగింపు పాదయాత్రకు పవన్ హాజరవ్వడం లేదన్నది వినిపిస్తున్న తాజా వార్తల తాజా సమాచారం.అయితే పవన్ తన పార్టీ అభ్యర్థుల సంఖ్యను స్పష్టంగా ప్రకటించే వరకూ జనసేనలో ఈ గందరగోళానికి ముగింపు పడే అవకాశం లేదని తెలుస్తుంది.ఒకవైపు మెగా బ్రదర్ నాగబాబు( Naga Babu ) తమ బలం 6 శాతం నుంచి 30% వరకు పెరిగిందని ఉభయ గోదావరి జిల్లాలో అయితే 40 శాతం వరకు ఉందని మీడియా వేదికగా కామెంట్ లు చేస్తూ ఉంటే మరోపక్క జనసేన కి 25 సీట్లు ఇవ్వరు అంటూ మీడియా లో వస్తున్న వార్తలు జనసేన కాడర్ ను అయోమాయనికి గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు వస్తే తప్ప పార్టీ రెండు పార్టీల భవిష్యత్తు ప్రయాణం సవ్యంగా సాగదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు