వైసీపీలో పెద్ద చర్చనీయాంశమైన అంశం ఏదైనా ఉందా అంటే అది కేవలం మంత్రి పదవుల మార్పు మాత్రమే.దాదాపు మూడు నెలల నుంచి ఇదే అంశం పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.
తమకే పదవి అంటే తమకే అంటూ అప్పుడే ప్రచారాలు కూడా మొదలు పెట్టేశారు.ఇంకొందరు అయితే అప్పుడే తమకు పదవి వచ్చేసినట్టు క్యాంప్ ఆఫీసులను కూడా రెడీ చేసుకుంటున్నారంట.
జిల్లాల వారీగా బేరీజు వేసుకుంటూ తమకే పదవులు ఖాయమంటూ చెప్పుకుంటున్నారు.ఇలా రోజుకో నేతల పేరు తెరమీదకు వస్తోంది.
ఇప్పుడు కూడా ఓ జిల్లా నుంచి ఓ మహిళా నాయకురాలి పేరు బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మహిళా మంత్రుల సంఖ్య పెరుగుతుందనే వార్తల నేపథ్యంలో ఆమె పేరు కూడా బలంగా వినిపిస్తోంది.
పైగా బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆమెకు బెర్త్ ఖాయమంటున్నారు.ఇదే క్రమంలో మొన్న వారింట్లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన జగన్ కుటుంబ సభ్యుల ముందే హామీ కూడా ఇచ్చారంట.
ఆమె ఎవరో కాదు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి. ఆమెకు జగన్ అభయహస్తం ఉందనే ప్రచారం బాగానే నడుస్తోంది.పైగా ఆమె ఇటీవల జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

మొన్న అసెంబ్లీలో మొదటి రోజు ఆమె మాట్లాడుతూ జగన్ ను పొగడ్తలతో ముంచెత్తింది.ఇక మొన్న అసెంబ్లీలో చంద్రబాబు ఘటన తర్వాత జగన్ మహిళలకు ప్రాధాన్యత పెంచేసి తాను మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెప్పాలని అనుకుంటున్నారంట.ఇందులో భాగంగానే కేబినెట్ లో ఆరుగురు మహిళలు ఉండేలా చూస్తున్నారని ప్రచారం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో రెడ్డి శాంతి పేరు బలంగా వినిపిస్తోంది.ప్రస్తుతం ఉన్న మహిళా ఎమ్మెల్యేల్లో ఆమె బలమైన నేతగా ఉన్నారు.
కాబట్టి శ్రీకాకులం జిల్లాలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఆమెకు పదవి ఇస్తారని చెబుతున్నారు.
.