నాని దసరా.. మల్టీస్టారర్..?

నాచురల్ స్టార్ నాని హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న సినిమా దసరా.దసరా సందర్భంగా కాన్సెప్ట్ టీజర్ తో వచ్చిన ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో నానితో పాటుగా మరో యంగ్ హీరో కూడా నటిస్తాడని లేటెస్ట్ టాక్.

Is Nani Dasara Is Multistarrer Movie , Dasara Movie, Keerthi Suresh, Latest Movi

నానికి సమానంగా మరో ఇంపార్టెంట్ రోల్ ఉంటుందట.ఆ పాత్ర ఎవరు చేస్తారన్నది మాత్రం ఇంకా తెలియలేదు.

నాని దసరా మల్టీస్టారర్ మూవీగా వస్తుందని తెలుస్తుంది.అయితే సెకండ్ హీరోది నిడివి తక్కువ ఉన్న పాత్రే అయినా సినిమాకు చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది.

Advertisement

నానితో స్క్రీన్ షేర్ చేసుకునే ఆ యంగ్ హీరో ఎవరన్నది చూడాలి.నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2022 దసరా బరిలో నిలుస్తుందని చెబుతున్నారు.

ప్రస్తుతం నాని శ్యాం సింగ రాయ్, అంటే సుందరానికీ సినిమాల్లో నటిస్తున్నాడు.శ్యాం సింగ రాయ్ డిసెంబర్ 24న రిలీజ్ ప్లాన్ చేశారు.

 వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో వస్తున్న అంటే సుందరానికీ సినిమా మాత్రం 2022 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు