ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ లో ఉన్నారు.ఏపీ తెలంగాణ విభజన చేసిన సమయంలో కాంగ్రెస్ లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి విభజన తీరుపై ఆగ్రహంతో ఆ పార్టీకి రాజీనామా చేసి జై సమాఖ్య పేరుతో కొత్త పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.2014.ఎన్నికల్లో ఏ సమైక్యాంధ్ర పార్టీ తరఫున పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మిగతా అభ్యర్థులు ఓటమి చవి చూసారు.
ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లో చేరి యాక్టివ్ అయ్యారు.ఆ తరువాత బిజెపిలో చేరిపోయారు.కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ) సేవలను తెలంగాణ ఇటు ఏపీ రాజకీయాల్లోనూ వాడుకోవాలని, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉండడంతో పాటు, రెండు రాష్ట్రాల్లో ఉన్న పాత పరిచయాలు ఇవన్నీ కలిసి వస్తాయని బిజెపి అంచనా వేసింది కానీ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు.

అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఎన్నికల ప్రచారం చేయించాలనుకున్నా.ఆ ఎన్నికలను ఆయన పెద్దగా పట్టించుకోలేదు.ఇక త్వరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
టిడిపి, జనసేన( TDP, Jana Sena ) ల తో బిజెపి పొత్తు కుదిరితే, పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీకి దిగబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.రాజంపేట నుంచి వైసిపి సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి( Midhun Reddy ) మళ్ళీ పోటీ చేయబోతున్నారు.
దీంతో మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందట.

అయితే ఆయన పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయనేది చెప్పలేం కానీ, ఇప్పటివరకు సైలెంట్ గానే ఉంటూ వచ్చి ఎన్నికల సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో యాక్టివ్ కావడం, ఎన్నికల్లో పోటీకి దిగబోతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది.ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితం అవుతూ వస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో ఎంతవరకు నెట్టుకు వస్తారనేది తేలాల్సి ఉంది.ఒకవేళ టిడిపి, జనసేనతో బిజెపి పొత్తు కుదరని పక్షంలో, కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి పోటీ చేయడం అనేది అనుమానమే.