మంగ‌ళగిరి సెంటిమెంట్ లోకేశ్‌కు అనుకూల‌మా.. వ్య‌తిరేక‌మా..?

టీడీపీ యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ పరిస్థితి దారుణంగా తయారైంది.వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో తేల్చకోలేకపోతున్నట్టు తెలుస్తోంది.

దానికి తోడు పార్టీలో ఎన్నడూ లేని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.సీనియర్ లీడర్లు అంతా పార్టీని వీడుతున్నారు.

దీంతో లోకేష్ వెన్నంటే ఉండి ఆయన్ను గెలుపు తీరాలకు చేర్చే కిందిస్థాయి కేడర్ కోసం లోకేష్ బాబు వెతుకులాట ప్రారంభించినట్టు సమాచారం.గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేయగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు.

ఆనాడు లోకేష్ కోసం తండ్రి, తల్లి, కట్టుకున్న భార్య వచ్చి కూడా ప్రచారం చేశారు.అయినా కూడా లోకేష్ విజయతీరాలను చేరలేకపోయాడు.

Advertisement

అయితే, ఓడిపోయిన ఫ్రస్టేషన్‌లో వచ్చే ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచి పోటీ చేస్తానని లోకేష్ ప్రకటన చేశాడు.మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నాయి.

అందుకే ఇప్పటినుంచే మంగళగిరిలో లోకేష్ గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ఆ నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తున్నారు.ఒక్కోసారి అకస్మాత్తుగా ఎంట్రీ ఇస్తున్నారు.అయితే, 2019 ఎన్నికల్లో లోకేష్ వెన్నంటే నడిచిన కేడర్లో కొంత వైసీపీ గూటికి చేరింది.

అందులో టీడీపీ సీనియర్ నేత, చేనేత నాయకుడు మురుగుడు హనుమంతరావు వైసీపీ కండువా కప్పుకున్నారు.దుగ్గిరాలలోనూ టీడీపీ పరిస్థితి ఘోరంగా ఉంది.కింది స్థాయి కేడర్‌ను యాక్టివ్ చేసి ఒక తాటిపై నడిపించే నాయకులు కనిపించడం లేదు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

ఇక అమరావతి, రాజధాని సెంటిమెంట్ మంగళగిరిలో పనికివచ్చేలా లేదు.చేనేత కార్మికులు కూడా లోకేష్ నాయకత్వం వద్దని తెగేసి చెబుతున్నారట.

Advertisement

దీంతో వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేయాలా? గెలిచే అవకాశాలున్న నియోజకవర్గం చూసుకోవాలా? అని లోకేష్ అంతర్మథనంలో ఉన్నారట.చూడాలి మ‌రి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుని లోకేష్ ముందుకు వెళ్తాడో.

తాజా వార్తలు