తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ సీరియల్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.
కానీ గత కొద్ది రోజులుగా కార్తీకదీపం సీరియల్ చప్పగా సాగుతుంది.ఒకప్పుడు కార్తీకదీపం సీరియల్ అంటే ఎంతో ఇష్టపడే వారు ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ అంటే బోరింగ్ సీరియల్ అని అంటున్నారు.
ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా కార్తీకదీపం సీరియల్ ప్రోమో లో కార్తీక్, దీపలు చనిపోయినట్లు, వారితో పాటుగా హిమ కూడా చనిపోయినట్టు చూపిస్తున్నారు.మరి ఒక వేళ కార్తీక్, దీప చనిపోతే అభిమానులు సీరియల్ చూస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే దర్శకుడు కాపు గంటి రాజేంద్ర సీరియల్ ని ఎటు తీసుకెళ్లాలో తెలియక నడిసముద్రంలో వదిలేశాడు.మరి కార్తీకదీపం సీరియల్ లో ప్రధాన పాత్రలు కాదు అనే కథను పక్కన పెట్టి మరీ కొత్తగా తెచ్చి పెడితే అభిమానులకి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
కార్తీక్ దీప ల చావుతో ముగించి పిల్లలు పెద్దవాళ్లు అయినప్పటి నుంచి కథ నడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం కార్తీక్ చెల్లెలు స్వప్న కొడుకులు ప్రేమ్, నిరుపమ్ లను పరిచయం చేసిన విషయం తెలిసిందే.

హిమ నిరుపమ్ ని, సౌర్య ప్రేమ్ ని ఫ్యూచర్ లో కలుసుకోబోతున్నారు హింట్ ఇచ్చేశారు.ఇకపోతే కారు ప్రమాదంలో దీప, కార్తీక్ లు హిమ ను కారులో నుంచి బయటకు తోసేసి ఉంటే అదృష్టవశాత్తు హిమ ప్రమాదం నుంచి తప్పించుకొని పెద్దగా అయ్యి దీప లా మారుతుంది.ఇక హిమ బావ నిరూపమ్ డాక్టర్ బాబు పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.అయితే కొందరు అభిమానులు ఈ సీరియల్ పట్ల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దీప, కార్తీక్ లు చనిపోవడం ఏంటి? అది కల అని అనుకుంటున్నారు.ఇక ఈ విషయంపై వస్తున్న అనుమానాలు తీరాలంటే తదుపరి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.