' కోనసీమ ' వార్ మళ్లీ రాజుకుంటోందా ? రంగంలోకి స్పెషల్ ఫోర్స్ ?

కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడంపై చెలరేగిన రచ్చ అంత ఇంతా కాదు.అన్ని జిల్లాలో పేర్లు ప్రకటించిన సమయంలోనే జిల్లా పేరును ఏపీ ప్రభుత్వం ముందుగా ప్రకటించింది.

 Is Konaseema Riots Emerging Again Special Force Into The Field Details,  Ambetka-TeluguStop.com

కానీ ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీలు,  ప్రజా సంఘాలు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.దీనిపై అభ్యంతరాలు స్వీకరణ కు నెల రోజుల గడువు విధించింది .చివరకు అమలాపురం లో మంత్రి పినిపే విశ్వరూప్,  ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసాల దహనం వరకు ఈ వ్యవహారం వెళ్లడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు విషయమై అభ్యంత్రాలు స్వీకరించేందుకు ప్రభుత్వం విధించిన గడువు పూర్తయింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేయబోతోంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే కోనసీమ జిల్లా ఏర్పాటు వ్యవహారంలో 217 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.ఇదిలా ఉంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా గా పేరు మార్పుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యక్తమైన అభ్యంతరాలు, సూచనలపై నివేదికను కలెక్టర్ ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది.
  ప్రస్తుతం జరుగుతున్న ఏపీ కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.

Telugu Ap, Chandrababu, Jagan, Konaseema, Konaseema Force, Ponnada Satish, Ysrcp

ఇప్పటికీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు విషయంపై జిల్లా మంత్రులు , పోలీసులు రెవెన్యూ అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.దీనిపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించబోతూ ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.ఈ మేరకు ముందస్తుగా జిల్లాలో 1300 మంది పోలీసులతో గస్తీని ఏర్పాటు చేశారు.

ఇది ఎలా ఉంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 12 పిటిషన్లు కోర్టులో దాఖలు కావడంతో , కోర్టు ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందనే  దానిపై ఉత్కంఠ నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube