తెలంగాణ ఎన్నికల ( Telangana election )ఫలితాల ముంగిట కేసిఆర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓటమి తప్పదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని మెజారిటీ సర్వేలు వెల్లడించినప్పటికి.
ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.ఫలితాలు విడుదల అయిన మరుసటి రోజు అనగా డిసెంబర్ 4న కేబినెట్ సమావేశానికి కేసిఆర్ పిలుపునిచ్చారు.
దీంతో ఒక్కసారిగా అందరిలోనూ కన్ఫ్యూజన్ నెలకొంది.ఆల్రెడీ బిఆర్‌ఎస్ కు వ్యతిరేక పవనాలు విస్తున్నప్పటికి కేసిఆర్ ఏ నమ్మకంతో కేబినెట్ మీటింగ్ కు రెడీ అయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది.
కాగా ఎన్నికల ముందు 100 కు పైగా సీట్లు సాధిస్తామని కేసిఆర్( CM kcr ) అండ్ కొ చెబుతువచ్చారు.

కానీ ఎన్నికలు ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్( Exit polls ) అన్నీ బిఆర్‌ఎస్ కు ప్రతికూల ఫలితాలనే కట్టబెట్టాయి.మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ఉందని తేల్చిచెప్పాయి.ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా పక్కా బిఆర్‌ఎస్ దే విజయం అని గులాబీ బాస్ ఫుల్ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తూ వచ్చారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రామాణికం కాదని, తుది ఫలితాల్లో బిఆర్‌ఎస్ దే విజయం అని ఆ పార్టీనేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు.అయితే ఈ రకమైన కాన్ఫిడెంట్ ఉండడం సహజమే అయినప్పటికి రిజల్ట్స్ వెలువడక ముందే కేబినెట్ సమావేశానికి పిలుపునివ్వడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే.

అటువైపు అధికారం మాదే అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు.ఇప్పటికే ఆపార్టీలో విన్నింగ్ సంబరాలు కూడా జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ నేపథ్యంలో కేసిఆర్ కేబినెట్ సమావేశంపై కాంగ్రెస్ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు.రాజీనామా చేసేందుకే కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారని కాంగ్రెస్ నేతలు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.మొత్తానికి అటు బిఆర్‌ఎస్ గాని ఇటు కాంగ్రెస్ గాని రెండు పార్టీలు కూడా విజయం పై ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాయి.మరి ప్రజా తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.